ఆంధ్రప్రదేశ్‌

‘సంతోషం’లో ఎపికి 72వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 16: వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ 72వ ర్యాంకు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా హ్యాపీనెస్ ఇండెక్స్‌లో మన దేశానికి 122వ ర్యాంక్ దక్కగా ఆ లెక్క ప్రకారం దేశం సాధించిన సంతోష సూచికల స్థాయి కంటే ఆంధ్రప్రదేశ్‌లో సంతోష స్థాయి అధికంగా ఉండటం విశేషం. ఏపిలోని 13 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా సంతోష సూచికల్లో అగ్రస్థానం నిలిచింది. దాని తరువాత స్థానం పశ్చిమ గోదావరి జిల్లాది. ఈ వరుసలో ప్రకాశం జిల్లా అట్టడుగున ఉంది. విశ్వ వ్యాప్తంగా 155 దేశాల్లో అధ్యయనం చేసి ఆయా దేశాల్లో సంతోష స్థాయిని అనుసరించి 2017 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌ను వెలువరించింది. ఈ 155 దేశాల్లో భారత్‌కు 122వ ర్యాంక్ దక్కింది. సంతోష సూచిక స్థాయిలో మన దేశం కంటే పాకిస్తాన్ 80వ ర్యాంక్‌తో, భూటాన్ 97వ ర్యాంక్‌తో, నేపాల్ 99వ ర్యాంక్‌తో, బంగ్లాదేశ్ 110వ ర్యాంక్‌తో, శ్రీలంక 120వ ర్యాంక్‌తో మెరుగైన స్థితిలో ఉన్నాయి. మన దేశం సాధించిన ర్యాంకుతో అంచనా వేసినప్పుడు ఏపి జాతీయ స్థాయిలో మెరిసింది. వాస్తవానికి దేశ స్థాయి కంటే ఎక్కువగా సంతోష సూచికల స్కోరు సంపాదించి ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ సాధించిన హ్యాపీనెస్ స్కోర్ 5,368, ఇదే సమయంలో సంతోషంలో భారత్ స్కోర్ 4,315 మాత్రమే. ఆంధ్రప్రదేశ్ స్కోర్ ర్యాంక్ 72తో సమానం. ఇదే భారత్‌ను చూస్తే 122వ ర్యాంక్. అంటే దేశం సాధించిన సంతోష సూచిక పాయింట్ల కంటే ఆంధ్రప్రదేశ్‌లో సంతోష స్థాయి ఎంతో అధికం. సంతోష సూచికలో ఆంధ్రప్రదేశ్ 5,273 స్కోరుతో ఉన్న చైనాను, 5,269 స్కోరు సాధించిన పాకిస్తాన్, 5011 స్కోరు వచ్చిన భూటాన్‌ను, 4,962 స్కోరుతో ఉన్న నేపాల్‌ను అధిగమించడం మరో విశేషం. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోని 3 అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయటమే లక్ష్యంగా నిర్ణయించుకుంది. విశ్వస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సంతోషదాయక సమాజాన్ని సృష్టించటమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎపిలోని 13 జిల్లాల్లో ప్రజల సంతోషాన్ని, సంక్షేమ స్థాయిలను కొలమానంగా తీసుకొని సర్వే చేశారు. ప్రజల సంతోష సూచిక స్థాయిలను అంచనావేయటానికి అంతర్జాతీయ సమాజం నుంచి ఐక్యరాజ్య సమితి, ఒయిసిడి ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు నిర్దేశించిన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2012లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీమూన్ సుస్థిర అభివృద్ధి పరిష్కారాల వ్యవస్థను ప్రారంభించారు. సుస్థిర అభివృద్ధి సాధనలో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల రూపకల్పన, అమలుకు ఆచరణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికే సుస్థిర అభివృద్ధి పరిష్కారాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2012 నుంచి సుస్థిర అభివృద్ధి పరిష్కారాల వ్యవస్థ ఏటా వివిధ దేశాల్లో సంతోష స్థాయిని అంచనా వేసి ఆ వివరాలతో వరల్డ్ హ్యాపీనెస్ నివేదికను ప్రచురిస్తూ వస్తోంది. భూటాన్ లాంటి దేశాలు సంతోష సూచికలను నిర్ణయించేందుకు నిర్మాణాత్మక ప్రయత్నాలు ప్రారంభించాయి. అభివృద్ధికి, ప్రగతికి ప్రజా జీవన నాణ్యత, సంతోషాలను సూచికలుగా తీసుకున్నాయి. ఈ అధ్యయనానికి తీసుకున్న గీటురాళ్లనే ప్రాతిపదికనగా తీసుకుని దేశ సగటుతో, ప్రపంచ దేశాల ర్యాంకింగ్స్‌తో పోల్చి ఆంధ్రప్రదేశ్‌లో సంతోష స్థాయిలను అంచనా వేయటం జరిగింది. దేశంలో ప్రజా సంతోష సూచిక నిర్ధారణకు విశ్వస్థాయి పద్ధతులను అనుసరించి ఫలితాలను రాబట్టిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కావటం విశేషం. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సంతోష సూచిక స్కోరు ప్రజా స్వీయ జీవన ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది. స్వీయ మూల్యాంకన ద్వారా ప్రజలకు వాస్తవిక స్థితిగతులు, శక్తి బోధపడతాయి. సంతోష సూచిక అంచనాకు ‘కాంట్రిల్ క్వశ్చన్ డిటర్‌మైన్’ ద్వారా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సగటు స్కోరును లెక్కగట్టారు.
క్యాంట్రిల్ లైఫ్ లాడర్ క్వశ్చన్
ఒక నిచ్చెననే ఉదాహరణగా తీసుకుంటే అందులో 0 నుంచి 10 దాకా మెట్లుంటాయి. అవరోహణ నుంచి ఆరోహణకు..అంటే కింద నుంచి పైకి మెట్లను ఎక్కడం అంటే మంచి ప్రమాణాలతో కూడిన జీవితం అని అన్వయించుకోవచ్చు. పై నుంచి కిందికి మెట్లు దిగటం అంటే జీవితం అత్యంత దుర్భరమైనదిగా భావించవచ్చు. నిచ్చెన మీద ఇప్పుడు ఏ మెట్టుమీద నిల్చున్నారని వ్యక్తిగతంగా భావిస్తున్నారనేది సర్వేలో అడిగిన ప్రశ్న.
సూచికలు
క్యాంట్రిల్ లైఫ్ లాడర్ పద్ధతిలో 6 సూచికలు ప్రాతిపదికన ఈ సర్వే చేపట్టారు. అవి జిడిపి, ఆరోగ్యంగా ఉన్న కాలంతో జీవిత కాలపు అంచనా, సామాజిక మద్ధతి, ఇష్టానుసారంగా జీవించే స్వేచ్ఛా, ఔదార్యాం, అవినీతిపై అవగాహన. సంతోష సూచికలను కేవలంపైన ఉదహరించిన ఈ 6 అంశాల ఆధారంగా మాత్రమే నిర్ధారించింది కాదు. ఆ ఆరు సూచికలు కేవలం ప్రాంతాల వారిగా స్కోరు తేడాలను అంచనా వేయడానికి ఇవి తోడ్పడ్డాయి.
శాంపిల్ సైజ్
దేశాల సంతోష సూచిక అంచనాకు జనాభా ప్రాతిపదికన ఒక్కో దేశంలో వెయ్యి మందిని ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేశారు. ఈ పద్ధతిలో ఎపిలోని 13 జిల్లాల్లో 17,800 మంది జీవన ప్రమాణాలపై అధ్యయనం చేశారు. అసంపూర్తిగా వచ్చిన స్పందనలు, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించి మొత్తం 16,159 పరిపూర్ణ స్పందనలు వచ్చిన ఎంట్రీలను పరిశీలించారు. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే సర్వేలో స్ర్తి, పురుషుల నుంచి వచ్చిన ఎంట్రీలు దాదాపు సమంగా ఉన్నాయి.

జిల్లాల వారీగా స్కోరు
జిల్లా హ్యాపీనెస్ స్కోర్
శ్రీకాకుళం 6,414
పశ్చిమ గోదావరి 6,067
కృష్ణా 5,764
నెల్లూరు 5,720
తూర్పు గోదావరి 5,672
గుంటూరు 5,515
విజయనగరం 5,370
విశాఖపట్నం 5,053
అనంతపురం 4,966
కడప 4,867
కర్నూలు 4,775
చిత్తూరు 4,751
ప్రకాశం 4,679