ఆంధ్రప్రదేశ్‌

సంస్కరణలపై విమర్శలు మామూలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: సంస్కరణలు అమలు చేసినప్పుడు విమర్శలు రావడం కొత్త కాదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా జిఎస్‌టి బిల్లును అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. దీని వల్ల భవిష్యత్తులో కొన్ని రాష్ట్రాల ఆదాయం తగ్గవచ్చన్నారు. చాలా రాష్ట్రాలకు ఆదాయం పెరగుతుందని, దీని వల్ల మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే వీలు కలుగుతుందన్నారు. రాష్ట్రానికి సంబంధించి జిఎస్‌డిపి రెండు శాతం వరకూ పెరగవచ్చన్నారు. దేశం అంతటా పన్నుల విధానంలో ఆయోమయం ఉండదని, పరిశ్రమలకు మేలు జరుగుతుందన్నారు. బహుళ పన్నుల విధానం వల్ల ఇబ్బందులు ఉండవని, అన్ని పార్టీలు ఈ బిల్లును ఆమోదించాయని గుర్తు చేశారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ విధానం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో నష్టాన్ని భరించేందుకు వీలు ఉండటంతో తాము కూడా ఆమోదిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ బిల్లు రాజకీయ, మార్కెట్ అవసరమని తెలిపారు. రాష్ట్రాలకు ఉన్న పన్ను విధించే అంశాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. దీని వల్ల సామాన్యుడికి జరిగే మేలు ఎమిటో చెప్పాలన్నారు. చెప్పకపోతే ఎందుకు అన్న ప్రశ్న తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. సామాన్యుడి కోణంలో ఈ బిల్లును చూడకపోడే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావచ్చన్నారు. ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ జిఎస్‌టి వల్ల కొన్నింటికి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉండదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి ఈ బిల్లు భంగం కలిగిస్తుందన్నారు. ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రభావితం చేస్తుందన్నారు. రాజకీయ అస్థిరత కారణంగా తమిళనాడులో, పార్టీ కారణాల వల్ల మహారాష్ట్ర, గుజరాత్ తమ గొంతు వినిపించలేకపోయానని తెలిపారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి రక్షించే విధంగా ఉండాలన్నారు. దీనిపై ఎమ్మెల్సీలు ఎంవివిఎస్ మూర్తి, పివి మాధవ్, సూర్యారావు, సోము వీర్రాజు, వాకాటి నారాయణ రెడ్డి తదితరులు కూడా ఈ బిల్లుపై మాట్లాడారు. దీనిపై మంత్రి యనమల స్పందిస్తూ ఈ బిల్లును తెచ్చేందుకు 10 సంవత్సరాలుగా విశే్లషణ జరుగుతున్నట్లు వివరించారు. అన్ని కోణాలు పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమిళనాడు కూడా మద్దతు తెలిపిందని తెలిపారు. పరోక్ష పన్నుల్లో వాట్ స్థానంలో జిఎస్‌టి రానుందన్నారు. అన్ని రాష్ట్రాల సహకారంతో ఈ బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేసిందన్నారు. రాష్ట్రాలకు నష్టం వస్తుందన్న అనుమానాలను కూడా నివృత్తి చేశారన్నారు.
భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా జిఎస్‌టి కౌన్సిల్‌కు పంపి చర్చించే వీలు ఉందన్నారు. వివిధ చోట్ల పన్నుల విధింపు లేకపోవడం వల్ల ఎగవేత ఉండదన్నారు. జిఎస్‌డిపి పెరిగి పేదరికం తగ్గుతుందన్నారు. అనంతరం ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.