ఆంధ్రప్రదేశ్‌

జంతువుల కోసం నీటి కుంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 16: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేసవిలో ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకొని అడవి జంతువుల దాహర్తిని తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నారు. అడవుల్లో ప్రత్యేక నీటి కుంటలను ఏర్పాటు చేసి జంతువులకు తాగునీరు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగా అటవీ ప్రాంతాల్లో సుమారు నాలుగువేల నీటికుంటలు (గొయ్యితీసి సిమెంటు వరలతో తయారు చేసిన కుంట) సిద్ధంచేసి జంతువులకు నీరందిస్తున్నారు. ఇందుకోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు అంచనా. జంతువుల రక్షణతో పాటు వాటి దాహార్తిని తీర్చేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయంతో గిరిజన ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వేసవి కారణంగా అడవుల్లో వాగులు, వంకలు ఎండిపోవడంతో నీటికోసం అడవి జంతువులు అల్లాడుతున్నారు. దీంతో అటవీ శాఖాధికారులు వాటి దాహార్తిని తీర్చేందుకు కీకారణ్యంలో కూడా నీటి కుంటలను ఏర్పాటు చేసి వాటి దాహర్తిని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జంతువుల కోసం అడవుల్లో ప్రతి 250మీటర్లకు ఒకటి చొప్పున కుంటలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కుంటలను నీటితో నింపేలా అటవీ శాఖాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఉత్తర్వులు జారీచేశారు. నీటి కుంటల్లో స్వచ్ఛమైన నీటినే పోయాలని, అజాగ్రత్తగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని వద్దిపేట, గన్నవరం, సబ్బంపేట, ముత్యాలపాడు సెక్షన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని నిత్యం నింపుతూ జంతువుల దాహార్తిని తీరుస్తున్నారు. అదే క్రమంలో జంతువులు తమదాహం తీర్చుకునేందుకు కుంటల వద్దకు వచ్చే సమయంలో వేటగాళ్ళ నుంచి వాటికి ప్రమాదం జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉండటం, అటవీ ప్రాంతంలో తాగేందుకు నీరుకూడా అందుబాటులో లేని సమయంలో ఈ నీటి కుంటలను ఏర్పాటు చేసి జంతువుల దాహార్తిని తీరుస్తున్నట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ నీటి కుంటలు ఏర్పాటు చేశామని, ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా వాటిలో నీరు నింపుతున్నామని అధికారులు వెల్లడించారు. కాగా నీటికుంటల ఏర్పాటు, నింపడంపై గ్రామీణ స్థాయిలో ఉన్న పెద్దల సహకారం కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జంతువులను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.

అడవిలో ఏర్పాటు చేసిన నీటికుంటలో నీరు నింపుతున్న సిబ్బంది