ఆంధ్రప్రదేశ్‌

వైద్య విద్యార్థుల కోసం వసతి గృహాలు: కామినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు, మహిళలకు వసతి గృహాలు తక్కువగా ఉన్నాయని, వారికి మరింత మెరుగైన వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పెద్దఎత్తున వసతి గృహాల నిర్మాణం చేపడుతున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. స్థానిక సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో రూ.20 కోట్లతో నిర్మించ తలపెట్టిన వసతి గృహాల సముదాయ నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సిద్ధార్థ వైద్య కళాశాలలో 550 మంది విద్యార్థినులు చదువుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. వసతి గృహ నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడకూడదని, నిర్మాణ పనులు 16 నెలలు లోపు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు మంత్రి సూచించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రూ.150 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణ పనులు పూర్తికానున్నాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదివే యూజి విద్యార్థులకు ట్యాబ్స్ ఇచ్చామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేందుకు తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్, బేబి కిట్స్‌తో పాటు మదర్ కిట్ ఇస్తున్నామన్నారు. త్వరలో మహా ప్రస్థానం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఇందుకు టెండర్లు పిలిచినట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్ గతంలో కంటే ప్రస్తుతం మెరుగుపడిందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోని వార్డుల్లో 7 రోజులు 7 రంగుల బోర్డరు అంచుతో బెడ్‌షీట్లు మారుస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ‘పేషంట్ ఇజ్ అల్టిమేట్’ అను అర్థం వచ్చేలా డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని అకడమిక్ డిఎంఇ బాబ్జీని మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు.