ఆంధ్రప్రదేశ్‌

సిఎంను కల్సిన ఎపిఎంఐడిసి చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎంఐడిసి) చైర్మన్‌గా నియమితులైన బిజెపి సీనియర్ నేత రంగావఝుల లక్ష్మీపతి తన పార్టీ మంత్రులు, శాసనసభ్యులు, సీనియర్ నేతలతో కలిసి మంగళవారం శాసనసభ ప్రాంగణంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరి వెంట రాష్ట్ర మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావు, శాసనసభ్యులు విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కంతేటి సత్యనారాయణరాజు, సోము వీర్రాజు, పివిఎన్ మాధవ్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, తదితరులున్నారు.
నేడు గుంటూరులో ప్రమాణ స్వీకారం
చైర్మన్‌గా నియమితులైన ఆర్.లక్ష్మీపతి బుధవారం ఉదయం గుంటూరు వైద్య కళాశాల ఆడిటోరియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాపట్ల ప్రాంతానికి చెందిన లక్ష్మీపతి 1972లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. ఎబివిపిలో రాష్ట్ర కోశాధికారిగా వ్యవహరించారు. 1993లో బిజెపిలో చేరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేశారు. 1994లో బాపట్ల శాసనసభకు పోటీ చేశారు.