ఆంధ్రప్రదేశ్‌

ఎవరెస్ట్ శిఖరంపై మరో నలుగురు రాష్ట్ర విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: రాష్ట్రానికి చెందిన మరో నలుగురు విద్యార్థులు ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని అధిరోహించారు. సాంఘీక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి ఇద్దరు, యువజన సంక్షేమ విభాగం నుంచి మరో ఇద్దరు విద్యార్థులు ఈ ఘనత సాధించారు. విజయనగరం జిల్లా భద్రగిరిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న బొడ్డ సాగర్, శ్రీశైలంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న శీలం ఈశ్వరయ్య, యువజన సంక్షేమ విభాగం నుంచి ధర్మతేజ, చెన్నారావు పర్వతారోహణ విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్ర కీర్తిని మరోసారి చాటారు. సాహస క్రీడల్లో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు అవసరమైన శిక్షణ, ఆర్థిక సహాయాన్ని అందించింది. రాష్ట్ర సాంఘీక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి 13 మందిని, యువజన సంక్షేమ విభాగం తరపున ఆరుగురుని మొత్తం 19 మందిని ఎంపిక చేసి రెండు బృందాలుగా పర్వతారోహణకు పంపించింది. వీరిలో ఈ నెల 13న ఆరుగురు దిగ్విజయంగా ఎవరెస్ట్‌ను అధిరోహించగా, తాజాగా మరో నలుగురు ఈ జాబితాలో చేరారు. గురుకుల పాఠశాల నుంచి తాజాగా ఈ ఘనత సాధించిన బొడ్ల సాగర్, శీలం ఈశ్వరయ్య తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, పేదరికం నుంచి వచ్చినా అకుంటిత దీక్షతో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆసరాను అందిపుచ్చుకుని అత్యున్నత శిఖరాన్ని చేరుకోవడం ద్వారా తల్లిదండ్రులకు, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. స్పష్టమైన లక్ష్యం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని మరోసారి నిరూపించారంటూ ప్రశంసించారు.

ఎవరెస్ట్ అధిరోహించిన విద్యార్థులు ఈశ్వరయ్య, ధర్మతేజ, సాగర్, చిన్నారావు