ఆంధ్రప్రదేశ్‌

అనుమానమే పెనుభూతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, మే 17: భార్యపై అనుమానంతో భర్త ఆమెను నడుస్తున్న రైల్లో నుంచి బయటకు తోసేయడంతో కిందపడి మృతి చెందిన విషాద సంఘటన ప్రకాశం జిల్లా కడవకుదురు రైల్వే గేటు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు బీహార్ రాష్ట్రానికి చెందిన అశుతోష్, అల్పనాకుమారి (23) దంపతులు తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో ఆమె తన సెల్‌ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు భర్త గమనించాడు. ప్రియుడితోనే మాట్లాడుతుందని అనుమానించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రేకానికి లోనైన అశుతోష్ తన భార్యను రైల్లో నుంచి తోసేసాడు. ప్రకాశం జిల్లా కడవకుదురు రైల్వే గేటు సమీపంలో ఈ ఘటన జరిగింది. తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు విజయవాడలో అతన్ని అరెస్టు చేశారు.
ఎమ్మెల్యే అనితపై పోస్టింగ్‌ల కేసు
బెంగళూరులో ఒకరి అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 17: విశాఖ జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనితపై అభ్యంతరకర పోస్టింగ్‌లు పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవీంద్ర అనే వ్యక్తిని విశాఖ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బెంగళూరులో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవీంద్రను అక్కడే అరెస్టు చేసి విశాఖ తీసుకువచ్చి విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టారంటూ ఎమ్మెల్యే అనిత కొద్ది రోజుల కిందట విశాఖ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవీంద్రపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. బెంగళూరులో అరెస్టు చేసి విశాఖ తీసుకువచ్చిన రవీంద్రను విచారించే విషయంలో పోలీసులు అత్యంత గోప్యత పాటించారు. రవీంద్రను విశాఖ తీసుకువచ్చినప్పటికీ మీడియాకు చిక్కనీయలేదు. రవీంద్రపై విచారణను ఎందుకు గోప్యంగా ఉంచారన్నది అంతు చిక్కని ప్రశ్న. అయితే ఎమ్మెల్యే అనితపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టిన అంశంలో రవీంద్ర ఎవరి ప్రోద్బలంతోనైనా పనిచేశారా లేక వ్యక్తిగతంగానే ఆయన ఈ చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అందుకే రవీంద్ర విచారణను గోప్యంగా ఉంచారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టారన్న కారణంగా ఇటీవలే పొలిటికల్ పంచ్ ప్రతినిధి రవికిరణ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా రవీంద్ర అరెస్టు సంచలనం రేకెత్తిస్తోంది. దీనిపై రాజకీయంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.