ఆంధ్రప్రదేశ్‌

రేషన్ డిపోలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 18: ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆహార భద్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రేషన్‌పై కోత పడింది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఇచ్చే సరుకులకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని జోడించి, రేషన్ డిపోల ద్వారా సరుకులు మంజూరు చేస్తోంది. రాష్ట్రంలో 29,980 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అలాగే 1,42,09,657 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈపోస్ కింద నమోదైన కార్డులు 1,38,69,012 ఉన్నాయి. రాష్ట్రంలోని రేషన్ డిపోల ద్వారా బియ్యం, పంచదార, పామోలిన్ ఆయిల్, కిరోసిన్, గోధుమలు, గోధుమ పిండి, చింతపండు, కందిపప్పు, ఉప్పు సరఫరా చేసేవారు. గతంలో ఒక కార్డు మీద మూడు లీటర్ల కిరోసిన్ ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు లీటరుకు తగ్గించేశారు. అలాగే గతంలో కిలో పంచదార ఇచ్చేవారు ఇప్పుడు అర కిలోకి తగ్గించారు. వీటితోపాటు బియ్యం తప్ప మరే సరుకులు రేషన్ డిపోల నుంచి సరఫరా కావడం లేదు. బహిరంగ మార్కెట్‌లో కిలో పంచదార 45రూపాయలు ఉంటే, రేషన్ డిపోల్లో కిలో 13 రూపాయలకే ఇచ్చేవారు. ఇప్పుడు అరకిలో పంచదార మాత్రమే ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పామాయిల్‌కు మంగళం పాడేశారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక, గోధుమల పంపిణీని నిలిపివేసింది. మూడేళ్ల కిందట తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 165 రూపాయలకే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఇచ్చేది. ఇప్పుడు వాటిని కూడా రద్దు చేసింది. కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పంచదారను మాత్రమే కొనసాగిస్తూ వచ్చింది. కొద్ది నెలల కిందట కేంద్రం ఈ సబ్సిడీని నిలిపివేయడంతో పంచదార పంపిణీ రాష్ట్రానికి భారంగా పరిణమించింది. సబ్సిడీని కొనసాగించాలని కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే, కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో వచ్చే నెల నుంచి రేషన్ డిపోల్లో పంచదార పంపిణీ కూడా నిలిచిపోనుంది. తొమ్మిది సరుకులలో కేవలం ఒక్క బియ్యం మాత్రమే మిగిలింది.
డిపోల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం ఏమాత్రం నాణ్యమైనవి కావు. అందుకే వీటిని తీసుకునేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. దీంతో రేషన్ డిపోల మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. రేషన్ డిపోలను సూపర్ మార్కెట్‌లుగా మార్చాలని ప్రభుత్వం గతంలో భావించింది. అయితే, ఇప్పుడు రేషన్ డిపోలను రైస్ స్టోర్స్‌గా మార్చాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ స్టోర్స్ ద్వారా బియ్యం తీసుకోని వారికి నగదు చెల్లించే విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు భోగట్టా.