ఆంధ్రప్రదేశ్‌

ప్రతి పక్షం రోజులకో కంపెనీ రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: ప్రతి 15 రోజులకు ఒక పెద్ద కంపెనీతో ఒప్పందం చేసుకోవడంతో పాటు వీలైనంత త్వరగా ఆ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ఐటి శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖను ఐటి హబ్‌గా మార్చేందుకు కావాల్సిన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. వైజాగ్ బ్రాండ్ పేరును ప్రమోట్ చేయడానికి కార్యక్రమాలు డిజైన్ చేయాలన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో లక్ష ఐటి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుని ఐటి శాఖ పని చేయాలన్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు జరిగేలా చూడాలన్నారు. భూ కేటాయింపులు త్వరితగతిన చేయయాలన్నారు. ‘కంపెనీలను ఆహ్వానించడానికి నేను ఎంత దూరమైనా వస్తాను. ప్రోటోకాల్ ముఖ్యం కాదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడమే నాకు ముఖ్యం’ అంటూ స్పష్టం చేశారు. కంపెనీల ఏర్పాటుకు అనుమతుల మంజూరు అడ్డంకి కాకుండా శాఖలో ఉండే ముఖ్య అధికారులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు, వెబ్‌సైట్ రియల్ టైం ట్రాకింగ్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్, ఐటి అడ్వైయిజర్ జెఎ చౌదరి, ఎపిఐఐసి ఎండి బాబు, తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న లోకేష్