ఆంధ్రప్రదేశ్‌

ఠారెత్తిస్తున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/విజయవాడ/ఒంగోలు, మే 19: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడు కావడంతో ప్రజానీకం బెంబేలెత్తుతోంది. బాపట్ల, ఒంగోలు, జంగమహేశ్వరపురం, నందిగామ, కావలి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, విజయవాడ పట్టణాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సాధారణం ఈ పట్టణాల్లో సాధారణం కంటే 3 నుంచి 8 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా బాపట్లలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇది సాధారణం కంటే 8.2 డిగ్రీలు అధికం. అలాగే ఒంగోలులో 45.8 డిగ్రీలు నమోదు కాగా, సాధారణం కంటే 5.7 డిగ్రీలు అధికం. కావలిలో 44.8 డిగ్రీలు నమోదు కాగా సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం. మరో రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు ఇదే విధంగా ఉంటాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
గాలిలో తేమ శాతం కారణంగా ఎండ వేడిమితో పాటు ఉక్కపోత అధికంగా ఉంటోంది శుక్రవారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి నమోదు కావడం అందోళన కల్గించే అంశం. తిరువూరులో 47.65 డిగ్రీలు, కంచికచెర్ల, మొగులూరులో 47.53, విజయవాడ రూరల్ మండలం నున్నలో 47.28, జి.కొండూరులో 47.05, పెనుగంచిప్రోలులో 47.03, గుంటూరు జిల్లా కొల్లిపరలో 47.43, అచ్చంపేటలో 47.23, పెదకాకాని మండలం నంబూరులో 47.02, ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం కొప్పెరపాడులో 47.08 డిగ్రీలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా సాయంత్రం చల్లబడ్డాకే బయటకు వెళ్లాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కమిషనర్ ఎంవి శేషగిరి బాబు తెలిపారు. కాగా ప్రకాశం జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రోళ్లు పగిలే ఎండలు కాస్తుండటంతో ఉదయం పది గంటల తరువాత ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఒంగోలు డివిజన్‌లో 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని బల్లికురవ మండలంలో అత్యధికంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు 47.08సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదు అయింది..
గోదావరి జిల్లాలపై వడ‘దెబ్బ’
ఏలూరు/రాజమహేంద్రవరం: ఈసారి వేసవి సీజన్ తన పూర్తి ప్రభావాన్ని చూపిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతతో వృద్ధులు పండుటాకుల్లా రాలిపోతున్నారు. పిల్లల విషయంలోనూ ఉష్ణోగ్రత తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఎండవేడిమికి తోడు వడగాల్పులు కూడా పెరిగిపోవడంతో అందరూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే దాదాపు 30 మందికి పైగా పైగా వడదెబ్బకు మృత్యువాత పడినట్లు సమాచారం.
అధికారికంగా ఈ సంఖ్యను ధ్రువీకరించకపోయినా ఆసుపత్రుల్లోనూ, ఆయా ప్రాంతాల్లోనూ మృతిచెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈసారి సీజన్‌లో మే మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోయింది. ఆ తరువాత నుంచి అదే స్థాయిలో కొనసాగుతూ వచ్చి క్రమంగా ఒక్కో డిగ్రీ పెరుగుతూ శుక్రవారానికి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. విడుపులేని రీతిలో ఎండలు కొనసాగడంతో వృద్ధులు, పిల్లలు అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లల ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఉదయం 11 గంటలు దాటితే ప్రధాన కూడళ్లలో జనసంచారం అంతంతమాత్రంగా మారుతోంది.

రెంటచింతలలో 49.3 డిగ్రీలు
గుంటూరు జిల్లా రెంటచింతలలో శుక్రవారం 49.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గతంలో 2002వ సంవత్సరంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.