కృష్ణ

అదరగొడుతున్న ఆదిత్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, మే 21: నగరంలో రోజురోజుకు ఎండ తీవ్రత అధికమవుతోంది. పగటి ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. దీంతో నగర వాసులు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ తీవ్రత తగ్గకపోగా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికి తోడు వడగాడ్పులు కూడా అధికమవ్వడంతో వృద్ధులు, పిల్లలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎండ ప్రభావం రవాణా రంగంపైనా పడిందనే చెప్పాలి. ప్రయాణికులు సైతం అత్యవసరమైతే తప్ప బస్సులు, ఆటోలు, వాహనాల్లో ప్రయాణించడం లేదు. దీంతో ఆర్టీసి బస్సులు మధ్యాహ్నం సమయానికి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అలాగే ఆటో డ్రైవర్లు సైతం ప్రయాణికులు లేక రోడ్ల మీదకు రావడం దాదాపుగా మానేశారనే చెప్పాలి. ఇంట్లో ఉన్నప్పటికీ తీవ్రమైన ఉక్కపోతతో అలమటిస్తున్న వారు అవసరం ఉన్నా, లేకున్నా ఎసి థియేటర్లకు వెళ్లి సేదతీరుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం షోలకు నగరంలోని దాదాపు అన్ని ఎసి థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భవన నిర్మాణ కార్మికులు, ముఠా కార్మికులు, రిక్షా వాలాలు, తోపుడు బండ్ల వ్యాపారులు ఇలా శ్రామిక వర్గాలకు చెందిన అనేక మంది ఎండకు అలమటిస్తున్నారు. పగటి సమయాల్లో నగరంలోని దాదాపు ముఖ్య రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగానే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడే ఈ విధంగా ఉంటే రోహిణికార్తె సమయానికి ఎండలు నగరంలో ఎలాంటి ప్రతాపాన్ని చూపిస్తాయోనని నగర వాసులు బెంబేలెత్తుతున్నారు.

ప్రస్తుత వేసవిలో అధికారులు
ముందస్తు చర్యలు చేపట్టాలి
* కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 21: జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఆదివారం జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపిడివోలు, తహశీల్దార్లతో వడగాడ్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోనే కృష్ణాజిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. రానున్న మరో 4రోజులు ఇదే తీవ్రత కొనసాగే ప్రమాదముందన్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సామాన్య ప్రజలు బయటకు రాకుండా ఉండేలా చూడాలని, అత్యవసరమైతే టోపీలు, గొడుగులు ధరించాలని సూచించారు. వడగాడ్పుల నుండి రక్షించుకునేందుకు కాటన్, లూజ్ వస్త్రాలు ధరించాలని సూచించారు. గ్రామాల్లో వడగాడ్పులపై టాంమ్, టాంమ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో అత్యవసర మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, మజ్జిగ ప్యాకెట్లు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వడగాడ్పులకు ప్రాణనష్టం సంభవించకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు.

4వాటర్ స్పోర్ట్స్, 6 స్విమ్మింగ్
అకాడమీల ఏర్పాటు
* మంత్రి కొల్లు రవీంద్ర
* రాష్టస్థ్రాయి స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం
విజయవాడ (స్పోర్ట్స్), మే 21: ముఖ్యమంత్రి క్రీడలకు ఎంతో ప్రాధాన్యత నిస్తున్నారని, రాష్ట్రంలో 4వాటర్ స్పోర్ట్స్, 6స్విమ్మింగ్ అకాడమీలు స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని సర్‌విజ్జి స్విమ్మింగ్ ఫూల్‌లో ఆదివారం రాష్టస్థ్రాయి సబ్‌జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌ను మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. వివిధ జిల్లాల స్విమ్మిర్ల మార్చ్ఫాస్ట్‌ను మంత్రి స్వీకరించారు. 13 జిల్లాల నుండి సుమారు 400 మంది స్విమ్మర్లు పాల్గొన్నారు. సోమవారంతో ముగియనుంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ జె నివాస్, డిఎస్‌డిఒ సిరాజుద్ధీన్, కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు, రాష్ట్ర స్విమ్మింగ్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పి గోవిందరాజు, మోహన్ వెంకటరామ్ , రమేష్, మహేంద్రజైన్, భవాన్ సోలంకి, తదితరులు పాల్గొన్నారు.