కృష్ణ

అటవీ ప్రాంతాన్ని 50 శాతానికి పెంచుతాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 22: ఆంధ్రప్రదేశ్‌లో 23 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని 50 శాతానికి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు కార్యరూపం దాల్చే విధంగా అధికారులు కృషి చేసి పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని అటవీ పర్యావరణం, శాస్త్ర - సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మే 22న ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుతుందన్నారు. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. జీవ వైవిధ్యంపై ప్రతి సంవత్సరం యుఎన్‌వో ఒక కానె్సప్ట్ ఇస్తుందని అందులో భాగంగా 2017వ సంవత్సరానికి జీవ వైవిధ్యం మరియు సుస్థిర పర్యాటకం అనే శీర్షికను ప్రతిపాదించిందన్నారు. ఈ గ్రహం మీద అనేక రకాలైన జీవులు, చెట్లు, చేమలు మన జీవనాన్ని ప్రభావితం చేస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నాయన్నారు. రాష్ట్రంలోని జీవ వైవిధ్యానికి కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలిని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి ఈ సంస్థ కృషి చేస్తోందన్నారు. జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలు.. బయోడైవర్శిటీ రిజిస్టర్ల తయారీకి కూడా దోహదం చేస్తాయన్నారు. అడవుల శాతం పెంచడం వల్ల కాలుష్యం తగ్గి, ఎండ తీవ్రత కూడా తగ్గే అవకాశం ఏర్పడుతుందన్నారు. అటవీ అధికారులు గ్రీన్‌బెల్ట్ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని, దీని వలన టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి నీరు - ప్రగతి కింద 90 రోజుల కార్యాచరణను అధికారులకు ఇవ్వడంలో ఆంతర్యం ఇదేనని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఎర్ర చందనం మన రాష్ట్రంలోని చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో దొరుకుతుందని దానిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలు, అధికారులపై ఉందన్నారు. ఎర్ర చందనం చెట్లను నరకడం ఆపాలని వాటిని అడ్డుకోవడం వల్ల సహజ సంపదను కాపాడుకున్నట్టవుతుందన్నారు. రాబోయే కాలంలో అటవీ బడ్జెట్‌ను 50 శాతం పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి తగు విధంగా చర్యలు తీసుకునే విధంగా కోరతామన్నారు. తొలుత మంత్రి శిద్దా రాఘవరావు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సభానంతరం మంత్రిని అటవీ అటవీ శాఖ అధికారులు సన్మానించారు. జీవ వైవిధ్య మండలి బోర్డు డైరెక్టర్ మిశ్రా మాట్లాడుతూ ఎకో సిస్టమ్ కాపాడటానికి అందరూ తోడ్పాటు అందించాలన్నారు. అటవీ శాఖ అధికారులు సురేంద్రపాండ్యే, కెఎస్ రెడ్డి తదితరులు జీవ వైవిధ్యంపై మాట్లాడారు. జీవ వైవిధ్య మండలి రూపొందించిన ‘జీవ జాతుల వైవిధ్యం - దేశ ప్రగతికి సపానం’ బ్రోచర్లను, వాల్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించి, పర్యావరణ పరిరక్షణకు విశిష్ట సేవలు అందించిన వివిధ జిల్లాలకు చెందిన కన్జర్వేటర్‌లకు, ఫొగ్రాఫర్‌లకు జ్ఞాపికాలను అందజేశారు.