కృష్ణ

పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా ఆంథోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 26: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రేషనలైజేషన్ జీవో 29 అమలు జరిగితే 3,778 ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయి.. ఆ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 53వేల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం అవుతుందని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పడతామని హెచ్చరించింది. పాఠశాలలు తెరిచిన రోజున అవి తాళాలు వేసి కనిపిస్తే, విద్యార్థుల్లో అత్యధికులు చదువు పూర్తిగా మానివేస్తారు.. అదే విధంగా మరో 2,384 ప్రాథమికోన్నత పాఠశాలలను ఈ జీవో ద్వారా ప్రాథమిక పాఠశాలలుగా స్థాయి కుదింపు చేస్తున్నారని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విద్యా పరిరక్షణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 43వేల మంది 6,7,8 తరగతుల విద్యార్థుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధానంగా ఎదిగే వయస్సులో ఉన్న బాలికలను ఇతర గ్రామాలకు పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడరన్నారు. వీరి భవిష్యత్ ఏమిటి.. అనే ప్రశ్న ఎదురవుతున్నదన్నారు. ప్రాథమిక పాఠశాలల మూసివేతలకు, ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయి కుదింపు చర్యలకు వ్యతిరేకంగా ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు, 30వ తేదీన కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు నిర్వహించాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో కూడి ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. అంతేకాకుండా ఈమేర శుక్రవారం ప్రభుత్వానికి నోటీస్ జారీచేసింది. లౌకిక ప్రజాతంత్ర విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా విద్యాపరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ (ఏపిటిఎఫ్ 1938) ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు (డిటిఎఫ్), తదితరులు పిలుపు ఇచ్చారు.