ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో పీపుల్ హబ్.. లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

4.36 కోట్ల వ్యక్తిగత వివరాల సేకరణ
ఆధార్ తరహాలో ఇళ్లకు విశిష్ట గుర్తింపు సంఖ్య
దేశంలోనే మొదటిసారన్న చంద్రబాబు

విజయవాడ, మే 26: రాష్ట్రంలోని 4.36 కోట్లమంది వ్యక్తిగత వివరాలతో రూపొందించిన పీపుల్ హబ్‌ను సిఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇందులో ఆధార్ తరహాలో నివాసాలకు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించనున్నారు. ఈ తరహా డేటా బ్యాంక్‌ను ఏర్పాటు చేయటం దేశంలోనే తొలిసారని సిఎం బాబు ప్రకటించారు. విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా శుక్రవారం పీపుల్ హబ్‌ను సిఎం లాంఛనంగా ప్రారంభించారు. పీపుల్ హబ్‌ను ఆరు నెలలపాటు శ్రమించి రూపొందించారు. ప్రజాసాధికార సర్వే, వివిధ ప్రభుత్వ శాఖల వద్దనున్న సమాచారాన్ని క్రోడీకరించి హబ్‌ను రూపొందించారు. ఇందులోని వివరాలు వివిధ వడపోతలకు గురవుతాయి. దీంతో పీపుల్ హబ్‌లో ఉన్న డేటా లోపరహితంగా ఉంటుంది. ఇప్పటికే 80 శాతం ప్రజల వివరాలు ఇందులో పొందుపరిచారు. మరో 20 శాతం మేరకు వివరాలు నమోదు చేయాల్సి ఉంది. డేటాను లోపరహితంగా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ డేటాను బిసి కమిషన్‌కు సంబంధించి వివిధ వివరాలు తెలిపేందుకు, విశే్లషణ ఆధారంగా నివేదికల తయారీ తదితర పనులకు ఉపయోగించుకుంటారు. దీనిని ఈ-ప్రగతితో అనుసంధానిస్తారు. త్వరలో నోటిఫై చేయనున్న కోర్ డిజిటల్ డేటా అథారిటీ పరిధిలోకి దీన్ని తీసుకురానున్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రపంచంలో ఎస్తేనియా దేశానికే ఈ తరహా డేటా ఉందన్నారు. అమెరికా, సింగపూర్‌లాంటి దేశాలకు కూడా లేదని గుర్తు చేశారు. వివిధ సర్ట్ఫికెట్ల జారీలో ఈ డేటాతో రియల్ టైమ్‌లో తనిఖీ చేసే వీలు ఉంటుందన్నారు. గురువారం ప్రారంభించిన ప్రజలే ముందు కార్యక్రమాన్ని 13 లక్షల మంది వీక్షించారని, 1100 కాల్ సెంటర్‌కు గురువారం రాత్రి 10.30 గంటల వరకూ 6090 కాల్స్ వచ్చాయని తెలిపారు. టెక్నాలజీని వినియోగించడం నేర్చుకోవాలని కలెక్టర్లను కోరారు. ఐకాన్స్‌తో కంప్యూటరీకరణ ఎలా? అనుకుంటున్న తరుణంలో టచ్ స్క్రీన్ విధానం అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేశారు. కంప్యూటర్స్ కోర్సు చేసిన వ్యక్తిని మంత్రిగా నియమించానని తెలిపారు. టెక్నాలజీ వల్ల సామాన్యుడు లబ్ధిపొందుతున్నారని, టెక్నాలజీయే జీవితంగా మారిందన్నారు. గతంలో సెక్రటేరియట్‌లో ఒక ఉద్యోగి చనిపోతే, టెక్నాలజీ వినియోగించాలంటూ తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగా చనిపోయాడంటూ ఆందోళన చేశారని గుర్తు చేశారు.
chitram...
పీపుల్స్ హబ్‌ను లాంఛనంగా ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు