ఆంధ్రప్రదేశ్‌

‘మహా’అట్టహాసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 27: తెలుగుదేశం 36వ మహానాడు శనివారం విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేతృత్వంలో మహానాడు జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు వివిధ వేషధారణలతో స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీపతి సతీష్‌తో ఆయన కాసేపు మాట్లాడారు. దానిపక్కనే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు. రక్తదానం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కార్యకర్తలను ఆయన అభినందించారు. ఆ తరువాత సభా వేదిక మీదకు చేరుకున్నారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత గడచిన సంవత్సర కాలంలో తెలంగాణ, ఏపిల్లో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల కుటుంబాలకు సంతాపం తెలియచేస్తూ, రెండు నిమిషాలు వౌనం పాటించారు.

చిత్రం... ప్రధాన వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్ట్, హైటెక్ సిటీ నమూనాలు