ఆంధ్రప్రదేశ్‌

మీకు నేనున్నా.. ప్రజలకు మీరు అండగా నిలవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు
80 శాతం జనం మనవైపుండాలి
మహానాడులో చంద్రబాబు నిర్దేశం

విశాఖపట్నం, మే 27: ప్రజలకు అండగా మీరుంటే, మీకు అండగా నేనుంటానని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు కార్యకర్తలకు ఉద్బోధించారు. మూడు రోజులపాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు శనివారం విశాఖలో ప్రారంభమైంది. తొలి రోజు ఉదయం జరిగిన స్వాగతోపన్యాసంలో చంద్రబాబు నాయుడు సుమారు గంటన్నరపాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘నేను ప్రజాహితం కోసం పనిచేస్తున్నాను. కార్యకర్తలు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలి’ అని సూచించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వం నుంచి ఏదోరకంగా సాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాను. అలాగే అన్ని వర్గాల ప్రజలకు మనం చేయూతనందిస్తే, వారంతా మన పార్టీకి తప్ప, వేరే పార్టీకి ఎందుకు ఓటు వేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు మన పార్టీకే మద్దతు పలికే విధంగా కార్యకర్తలు, నాయకులు వ్యవహరించాలని అన్నారు. ‘పార్టీ కోసం మీరు పనిచేయకపోయినా, పట్టించుకోను. ప్రజలతో మమేకమై పనిచేయకపోతే సహించన’ని ఆయన హెచ్చరించారు. పార్టీకి పనిచేసి, ప్రజలతో బాగుండకపోతే పార్టీకి ఫలితం ఉండదని ఆయన అన్నారు. అటువంటి వారికి పార్టీలో ఏమాత్రం గుర్తింపు ఉండదని ఆయన అన్నారు. పార్టీ పురోభివృద్ధికి కార్యకర్తలు ఇచ్చే ప్రతి సలహాను తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. హుదూద్‌కు దెబ్బతిన్న విశాఖకు తిరిగి అందాలు తెచ్చిపెట్టానని, ఆ స్ఫూర్తితో కార్యకర్తలు, నాయకులు ఎవరి గ్రామాలను వారు అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇది అసాధ్యం కాదనే విషయాన్ని కార్యకర్తలు గుర్తించాలని ఆయన చెప్పారు. బాబు వస్తే, జాబు వస్తుందని ఎన్నికల ముందు చెప్పాం. ఆ హామీని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు తెలియచేశారు. పార్టీ క్యాడర్ ఇంటింటికి వెళ్లి, మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించండి అంటూ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అవినీతి రహిత పాలన అందించాలన్న లక్ష్యంతో తాను పనిచేస్తున్నాను. అందుకు పార్టీ క్యాడర్ మొత్తం సహకరించాలని చంద్రబాబు కోరారు. పార్టీలో ఒకరిద్దరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అంటువంటి వారి వలన పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తాను వెనకాడను. దీనికి మీరు ఆమోదిస్తారా? అని కార్యకర్తలను చంద్రబాబు ప్రశ్నించారు. బాబు నిర్ణయాన్ని సమర్థిస్తూ సభాస్థలి నుంచి పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. తెలుగువారి జీవితాల్లో టిడిపి వెలుగు నింపిందని ఆయన అన్నారు. ఏ పార్టీ చరిత్రలో లేని విధంగా తెలుగుదేశం ఒక్కటే ప్రతి ఏటా క్రమం తప్పకుండా మహానాడు నిర్వహిస్తూ వస్తోందని ఆయన చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ విధానాలు, సిద్ధాంతాల్లో మార్పులు చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మూడు పదులు దాటిన తెలుగుదేశం పార్టీ కోసం అనేక మంది నిస్వార్థంగా పనిచేసారు. వారికి చంద్రబాబు నాయుడు పాదాభివందనం తెలిపారు. ఎన్టీఆర్ ఆశయసాధన కోసం పనిచేస్తున్న కార్యకర్తల్ని ఏకతాటిపై తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రజల తరపున పోరాడేది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని ఆయన అన్నారు. అందుకోసమే ప్రజలే ముందు అన్న నినాదాన్ని తీసుకువచ్చామని ఆయన తెలియచేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్భ్రావృద్ధి కోసం పనిచేశామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడామని చంద్రబాబు చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కూడా రాజీలేని పోరాటం చేశామని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అన్యాయంగా కూల్చేసినప్పుడు ప్రజాభిమానంతోనే కేవలం 30రోజుల్లో ఆయన మళ్లీ అధికారంలోకి రాగలిగారని చంద్రబాబు చెప్పారు. అంతగా ప్రజాభిమానాన్ని చూరగొన్న ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఈ సభ నుంచి మరోసారి తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

చిత్రం... విశాఖపట్నంలో శనివారం ప్రారంభమైన టిడిపి మహానాడు వేదికపైనుంచి ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు. మహానాడుకు వచ్చిన ముఖ్యమంత్రికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు