ఆంధ్రప్రదేశ్‌

గరుడ బస్సు బోల్తా ... 17 మందికి తీవ్ర గాయాలు * ముగ్గురి పరిస్థితి విషయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, మే 27: తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థకు చెందిన గరుడ బస్సు శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో బోల్తా పడింది. దీంతో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బస్సులోని ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్షసాక్షులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీ చెందిన గరుడ బస్సు(టిఎస్ 07 జెడ్ 4071) హైదరాబాద్ నుంచి 49 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి బెంగళూరుకు బయలుదేరింది. డ్రైవర్ సిహెచ్ రావు బస్సు నడుపుతున్నాడు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో బస్సు అనంతపురం జిల్లా గుత్తి మండలం వనె్నదొడ్డి సమీపంలోకి చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని దాటే ప్రయత్నంలో డ్రైవర్ వేగం పెంచడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న 15 అడుగుల లోతు ఉన్న గుంతలో పడిపోయింది. పెద్దశబ్ధం రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా మేల్కొన్నారు. చీకట్లో ఏమీ కనిపించలేదు. తాము ప్రమాదానికి గురైనట్లు తెలుసుకుని హాహాకారాలు చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన నీలకంఠ తొలుత తేరుకుని 108కు సమాచారం అందించాడు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన జ్యోతి, ఆమె అవ్వ రమాదేవి, విజయ్, ఆయన భార్య అల్కా, అఖిల, సురేష్, భరత్, వినయ్, ప్రణీత, గౌరి, పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాకేష్ కుమార్, అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన సల్మాన్ సుధీర్, బెంగళూరుకు చెందిన సుజయ్, కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన నీలకంఠ, విజయనగరం జిల్లాకు చెందిన రాజేంద్ర ఉన్నారు. బస్సు డ్రైవర్లు సిహెచ్.రావు, శీనయ్య సైతం తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ తొలుత గుత్తి ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రమాదేవి, సల్మాన్ సుధీర్, అఖిలను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గుత్తి పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

chitram... బోల్తా పడిన గరుడ బస్సు