కృష్ణ

జిల్లాలో 391 మీసేవా కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 27: జిల్లాలో 362 గ్రామ పంచాయతీల్లో 391 మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు శనివారం అనుమతులు మంజూరు చేశారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు గతంలో దరఖాస్తులు ఆహ్వానించగా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. అర్హులైన అభ్యర్థులతో పాటు వారికి కేటాయించిన మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు జెసి అనుమతులు మంజూరు చేశారు. బందరు డివిజన్‌లో 45 గ్రామ పంచాయతీలకు గాను 46 మీ సేవా కేంద్రాలు, గుడివాడ డివిజన్‌లో 59 గ్రామ పంచాయతీలకు గాను 59 మీ సేవా కేంద్రాలు, నూజివీడు డివిజన్‌లో 139 గ్రామ పంచాయతీలకు గాను 140 కేంద్రాలు, విజయవాడ డివిజన్‌లో 119 గ్రామ పంచాయతీలకు గాను 146 మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారు. మీ సేవా కేంద్రాలు, అభ్యర్థుల నియామక ఉత్తర్వులను కృష్ణా వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు జెసి చంద్రుడు తెలిపారు.

ఘనంగా ప్రారంభమైన శత చండీయాగం
పెనుగంచిప్రోలు, మే 27: స్థానిక శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శత చండీయాగం శనివారం కన్నుల పండువగా ప్రారంభం అయ్యింది. ముందుగా ఆలయంలోని శ్రీతిరుపతమ్మ, శ్రీగోపయ్య స్వామి ఉత్సవ విగ్రహాలకు ఆలయ పూజారులు మర్రెబోయిన వెంకట రమణ ఆధ్వర్యంలో కార్యనిర్వహణ అధికారి ఎం రఘునాధ్, పాలకమండలి చైర్మన్ కర్ల వెంకట నారాయణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను అందంగా అలంకరించిన మండపంపై ఉంచి సత్రం సెంటర్ వద్ద ఉన్న యాగశాలకు తీసుకువచ్చారు. అనంతరం వేదపండితులు గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహాలను ఉంచారు. తరువాత 9.25గంటల శుభ ముహూర్తానికి గణపతిపూజతో శత చండీయాగాన్ని ప్రారంభించారు. అనంతరం గోపూజ, స్వస్తి పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగొరణం, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీప స్థాపన, ద్వార పూజలు, షోడశ స్థంభ పూజలు, అంకురార్పణ నిర్వహించారు. సాయంత్రం 3గంటల నుండి ప్రారంభమైన శత చండీయాగంలో వేదపండితులు పలు యాగాలను నిర్వహించారు. ఈ శత చండీయాగాన్ని నందిగామ డిఎస్‌పి యు ఉమామహేశ్వరరావు, తహశీల్దార్ కె నాగేశ్వరరావు, ఎండిఒ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ అవినాష్, సర్పంచ్ చింతల శ్రీలక్ష్మి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శత చండీయాగాన్ని వేదపండితులు దిలీప్ కుమార్, కిరణ్‌కుమార్, లక్ష్మణ శర్మ, కృష్ణ చంద్ర ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. కాగా ఈ పూజా కార్యక్రమాల్లో ఎఇఒ మేడా గోపాలరావు, ఇఇ నూకరత్నం, డిఇ రమ, పాలకమండలి సభ్యులు బొల్లం లింగయ్య, కోడె వెంకటేశ్వర్లు, మాదల వనజ, ముండ్లపాటి లక్ష్మి, పెనుగొండ కోటేశ్వరరావు, తునికిపాటి రామాచారి తదితరులు పాల్గొన్నారు.