ఆంధ్రప్రదేశ్‌

పెనవేసుకున్న అనుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్యకర్తలను అక్కునజేర్చుకున్న చంద్రన్న

అన్న బాటలో అధినేత పేద తమ్ముళ్ల కుటుంబాలకు ఆర్థిక సాయం
కార్యకర్తల మధ్యకు నడిచి వెళ్లిన ముఖ్యమంత్రి

విశాఖపట్నం, మే 28: పార్టీలో కనుమరుగవుతున్న అన్న కాలం నాటి మానవ సంబంధాలను పునరుద్ధరించేందుకు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూనుకున్నారు. దశాబ్దాల నుంచి జెండాను భుజానేసుకుని పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న దుస్థితిలో వారిపై దృష్టి సారించడం లేదన్న విమర్శలకు ఆదివారం మహానాడులో తెరదించే ప్రయత్నాలు చంద్రబాబు చేశారు. మహానాడు రెండోరోజు కార్యక్రమంలో ఇందుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. బాబు తన నిర్ణయాలను ప్రకటిస్తున్న సమయంలో, కార్యకర్తల నుంచి హర్షధ్వనాలు వచ్చాయి. పార్టీ కోసం ఆది నుంచీ కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు బాబు అక్కడిక్కడే ఆర్థిక సాయం ప్రకటించడం ద్వారా, పార్టీలో కనుమరుగైన అన్న ఎన్టీయార్ కాలం నాటి మానవ సంబంధాలను మళ్లీ పునరుద్ధరిస్తున్న సంకేతాలిచ్చారు. కడప జిల్లాకు చెందిన పేద కార్యకర్త పాలడుగు రామారావు ఎక్కడ పార్టీ కార్యక్రమాలు కానీ, ఎన్నికల ప్రచారం కానీ నిర్వహించినా, కుటుంబం గురించి పట్టించుకోకుండా అక్కడికి సైకిల్ మీద వెళుతుంటారు. చంద్రబాబు మహానాడు వేదికపైకి రామారావును పిలిచి, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏం కావాలని అడిగారు. తాను పార్టీ కార్యక్రమాలకు వస్తున్నందున, గతంలో కట్టుకున్న చిన్న ఇల్లు డబ్బులేక మధ్యలోనే నిలిచిపోయిందని చెప్పాడు. దానికి స్పందించిన బాబు ఆయనకు పదిలక్షల ఆర్థికసాయం ప్రకటించారు.
ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటివరకూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పార్టీ కార్యక్రమాలు జరిగినా అక్కడికి వెళ్లి, ఎన్టీఆర్ రూపంలో కార్యకర్తలను అలరించే వడ్డెర రాము అనే బడుగు కార్యకర్తంటే తెలియని వారుండరు. అచ్చు ఎన్టీఆర్‌లా హావభావాలు ప్రదర్శించే రామును బాబు వేదికపైకి పిలిచి అతనికి ఏం కావాలని అడిగారు. తాను రాష్ట్రం అంతటా తిరిగి పార్టీని పటిష్ఠం చేస్తానని చెప్పడంతో, ఆయనకు టూరిజం డైరక్టర్ పదవి ఇస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించి అందరినీ ఆవ్చర్య పరిచారు. ప్రముఖ పౌరాణిక గాయకుడు, శ్రీకృష్ణుడి పాత్రను సజీవంగా ఆవిష్కరించే గుమ్మడి గోపాలకృష్ణ చాలాకాలం నుంచీ పార్టీకి పనిచేస్తున్నారు. ఆయన ప్రతిభ, పార్టీకి చేస్తున్న సేవలు గుర్తించిన బాబు ఆయనను వేదికపై పిలిచి నాటక అకాడమీ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్టీఆర్ అభిమాన సంఘాల అధ్యక్షుడిగా రాష్ట్రంలోని కార్యకర్తలందరికీ సుపరిచితమైన, వికలాంగుల సహకార సంస్థ మాజీ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా సేవలను గుర్తించిన బాబు, ఆయన కష్టసుఖాలు, కుటుంబం గురించి ఆరా తీశారు. ఏం కావాలని అడిగితే, తన కుమారుడు విదేశీ విద్యకు ఆర్థిక సమస్యలున్నాయని చెప్పారు. దానికి స్పందించిన బాబు.. ఆయనకు 15లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.
‘సాయిబాబాను నేను ఇనే్నళ్ల నుంచి చూస్తున్నా. ఒక కాలితోనే కర్రతోనే కష్టపడి పనిచేస్తున్నాడు. నేను వీళ్లందరికీ ఏదైనా చేయాలని చాలాకాలం నుంచి అనుకుంటున్నా ఏదో పనుల్లో పడి మర్చిపోతున్నా. అందుకే ఇప్పుడే ప్రకటిస్తున్నా. ఒక్కోసారి ఈ అనుబంధం, ఆత్మీయత చూస్తే నాకే ఒళ్లు పులకరిస్తుంది. ఈ బంధం చిరస్మరణీయమైనది. వీళ్లే కాదు. వీళ్ల మాదిరిగా ఇంకా మీ నియోజకవర్గాల్లో చాలామంది కార్యకర్తలున్నారు. వారిని మీరూ ఆదుకోండి. వీళ్లంతా మన కుటుంబసభ్యులు’ అని బాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
అంతేకాకుండా గత మహానాడులకు భిన్నంగా ఈసారి తొలిసారిగా కిందకు దిగి కార్యకర్తల మధ్యకు వచ్చిన చంద్రబాబు, అందరినీ పేరుపేరునా పలకరించారు. ఫొటోలు దిగారు.
వైఎస్ దారిలో బాబు
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇనే్నళ్లలో బాబు పేద కార్యర్తలను పిలిచి మీకు ఏం కావాలని అడగటం ఇదే తొలిసారి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు-పార్టీ కోసం కార్యకర్తలు, వివిధ వర్గాలకు చెందిన వారు ప్రత్యక్షంగా-పరోక్షంగా కష్టపడ్డారు. అయినా ఈ మూడేళ్లు, అంతకుముందు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో బాబు ఏనాడూ వారిని పిలిచి ఏం కావాలని అడిగిన దాఖలాలు లేవని నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ విషయంలో కార్యకర్తలు వైఎస్ రాజశేఖర్‌రెడ్డినే గుర్తుంచుకునేవారు. వైఎస్ పేద కార్యకర్తలు, తన కోసం పనిచేసిన వారిని పిలిచి మరీ ఏం కావాలో అడిగి ఆర్థికంగా స్థిరపరిచేవారని, తమ అధినేతలో అలాంటి లక్షణాలు లేవని, బాబు కూడా వైఎస్ దారిలో నడిస్తే అంతా ఆయనను గుండెలో పెట్టుకుంటారని ఇప్పటివరకూ టిడిపి కార్యకర్తలు బాహాటంగానే వ్యాఖానించేవారు. తాజా ఆదివారం నాటి ఆంధ్రభూమి దినపత్రికలోనూ పార్టీలో మంటకలసిపోతున్న మానవ సంబంధాలపై కార్యకర్తల మనోవేదనను ప్రతిబింబిస్తూ కథనం వెలువరించింది. దీనితో స్పందించిన బాబు, కష్టపడి పనిచేస్తున్న పేద కార్యకర్తల విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడం లక్షలాది మంది కార్యకర్తలను మెప్పించింది.