ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో భూ దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 30: విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములను తినేశారు. అత్యంత భధ్రంగా ఉంచాల్సిన భూముల రికార్డులు టాంపరింగ్‌కు గురయ్యాయి. జిల్లాలోని చాలా రెవెన్యూ కార్యాయాల్లో భూముల రికార్డులను మాయం చేశారు. రాష్ట్రంలో భూ రికార్డులను తారుమారు చేయడంలో చేయితిరిగిన ఓ వ్యక్తి సిసిఎల్‌ఆర్‌లోనూ విశాఖ భూముల రికార్డులు తారుమారు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ కావడంతో ఈ ప్రాంతంలో సెటిలవ్వడం కోసం చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఆర్‌ఐలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇక్కడ భూములు కొనుగోలు చేసుకున్నారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధులకు కూడా విలువైన భూములిచ్చారు. విశాఖలో భూముల విలువ అమాంతంగా పెరిగిపోయింది. దాంతో భూములపై కబ్జాదారుల కళ్లుపడ్డాయి. అధికార పార్టీ నేతల అండతో భూఆక్రమణల పరంపర కొనసాగింది. రెవెన్యూ అధికారులను లోబర్చుకుని ల్యాండ్ రికార్డులను తారుమారు చేశారు. అడంగళ్, 1బి, ఎఫ్‌ఎంబిలను మాయం చేశారు. ఇలా కనిపించకుండా పోయిన సర్వే నెంబర్లలో తమకు కావాల్సిన వారి పేర్లను చొప్పించి, కొత్త రికార్డులను తయారు చేసుకున్నారు. విశాఖ శివారులో సుమారు 2,200 కోట్ల రూపాయల విలువైన భూముల రికార్డులు టాంపరింగ్ అయినట్టు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమారే బహిర్గతం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి కలెక్టర్ ఇద్దరు ఉద్యోగులను కూడా సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద భూమాఫియా పనిచేస్తోందని అర్థమవుతోంది.
రావణకాష్టం దసపల్లా భూములు
ఇదిలా ఉండగా అత్యంత విలువైన దసపల్లా భూముల వివాదం రావణకాష్టంగా మారింది. ఈ భూమి తమకు సంబంధించిందని దసపల్లా రాణి కోర్టుకెళ్లగా, ఆమెకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. యువరాజ్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఈ భూమి ప్రభుత్వానికి చెందిందేనని సెక్షన్-30లో పేర్కొన్నారు. ఇక్కడ ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే, ఇదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహం, నీటి సరఫరా విభాగం కూడా ప్రైవేటుపరమైనట్టు తెలుస్తోంది. ఈ భూమి ఇప్పుడు అధికార పార్టీ నేతల ఆశీస్సులతో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అనుభవిస్తున్నట్టు సమాచారం. దీనిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఉద్యమానికి సిద్ధమవుతోంది.
స్థానిక నేతల హస్తం
విశాఖ భూకబ్జాలో అధికార పార్టీవారే ఎక్కువ ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ గత కొద్ది రోజులుగా జరిపిన సర్వేలో జిల్లావ్యాప్తంగా 20 వేల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని తెలుస్తోంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
విశాఖలో వేల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతమవుతున్నా, ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. భూ ఆక్రమణలపై బహిరంగ విచారణకు సిద్ధమని రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి చెపుతున్నా, బాధితులు స్వేచ్ఛగా ముందుకొస్తారని చెప్పలేం. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోతే, ఎస్‌ఐ, సిఐ స్థాయి అధికారులు భూమాఫియాకు సహకరించిన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.