ఆంధ్రప్రదేశ్‌

రాహుల్‌కు నిరసనల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 4: గుంటూరులో జరిగిన ప్రత్యేక హోదా సాధన భరోసా సభలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కార్యకర్తల ఘన స్వాగతం లభించింది. అయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వ్యూహాత్మకంగా మార్గంమధ్యలో పలుచోట్ల నల్లజెండాలు, ప్లకార్డులతో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన బసచేసిన ఒక హోటల్ వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, యువనేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపి ‘రాహుల్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో వీరిద్దరు సహా దాదాపు 40మందికి పైగా కార్యకర్తలను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకుని రాహుల్ నగరం విడిచి వెళ్లిన తరువాత విడుదల చేశారు. హోటల్ వద్ద ఒకదశలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గన్నవరం సమీపంలోని కేసరపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆంజనేయస్వామి ఆలయం వద్ద వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు నల్లజెండాలు పట్టుకుని ‘రాహుల్ గోబ్యాక్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఇప్పుడు ఏవిధంగా ప్రత్యేక హోదా కోరుతున్నారంటూ తెలుగురైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు ప్రశ్నించారు. ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. రామవరప్పాడు రింగ్ సెంటర్‌లోని ఒక హోటల్‌లో రాహుల్ బసచేయగా తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నాయకత్వంలో కార్యకర్తలు నల్లజెండాలు పట్టుకుని హోటల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈసందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ‘రాహుల్ గోబ్యాక్’ అంటూ వారు పెద్దపెట్టున నినదించారు. ఈసందర్భంగా వెంకన్న మాట్లాడుతూ నాడు రాష్ట్రానికి అన్యాయం చేసి నేడు ప్రత్యేక హోదా పేరుతో రాహుల్ జగన్నాటకాలు అడుతున్నారని విమర్శించారు. పోలీసులు జోక్యం చేసుకుని వెంకన్నను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తరువాత యువనేత అవినాష్ పెద్దసంఖ్యలో విద్యార్థులను వెంటబెట్టుకుని తిరిగి నిరసన కార్యక్రమం చేపట్టారు. మళ్లీ పోలీసులు కలుగచేసుకుని అవినాష్‌తో పాటు 15మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి అనంతరం వారిని విడిచిపెట్టారు.