ఆంధ్రప్రదేశ్‌

బదిలీలపై ఫ్యాప్టో-జాక్టో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 4: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతనెల 31 తేదీ జారీచేసిన 31 జీవోకు కొన్ని సవరణలు చేస్తూ ఆదివారం 32 నెంబర్‌తో వెబ్ కౌన్సిలింగ్ కొనసాగింపును వ్యతిరేకిస్తూ మండలాల్లో ప్రత్యేకంగా కంప్యూటర్లను ఏర్పాటుచేయాలని కోరుతూ ప్యాఫ్టో-జాక్టోల ఆధ్వర్యంలో ఈ నెల 5తేదీన డైరక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.
సవరణ జీవో ప్రకారం విలీనం చేసిన, మూతబడిన పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విలీనం అయిన పాఠశాలకు వెళ్లవచ్చును. లేదా వేరొక పాఠశాలకు వెళ్లదలిస్తే బదిలీకి అప్లై చేసుకోవచ్చు.
రేషనలైజేషన్‌లో పోస్టు రద్దు అయినప్పుడు ఆ పాఠశాలలో సర్వీసు జూనియర్ ఉపాధ్యాయుని బదిలీ చేస్తారు. సీనియర్ బదిలీకి ఇష్టపడిన సీనియర్‌ను బదిలీ చేస్తారు. ఆ పాఠశాలకు 8 అకడమిక్ సంవత్సరాలు నిండిన ఉపాధ్యాయుడుంటే ఆ ఉపాధ్యాయుడిని బదిలీ చేస్తారు. ఒకే పాఠశాలలో అన్ని కేడర్లలో పనిచేసిన సర్వీసును బదిలీకి లాంగ్ స్టాండింగ్‌గా తీసుకుంటారు. ఒక సంవత్సరం సర్వీసుకు 0.5 పాయింట్ కేటాయిస్తారు. కేటగిరి-4 ప్రాంతానికి వెళతామనే వారికి ప్రత్యేక పాయింట్లు తొలగించారు. స్పౌజ్ భార్యాభర్తలకు కేటాయించే స్పెషల్ పాయింట్లు 5కి పెంచారు. రేషనలైజేషన్ పాయింట్లు 2 కేటాయించారు.
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఇన్‌స్పైర్, సైన్స్‌ఫేర్‌లలో విద్యార్థులు పాల్గొన్నప్పుడు ఆయా పాఠశాలలు సైన్స్ టీచర్లకు జాతీయ స్థాయికి 6 పాయింట్లు, రాష్టస్థ్రాయికి 4 పాయింట్లు కేటాయిస్తారు. రేషనలైజేషన్, బదిలీలు పూర్తయిన తర్వాత రిలీవ్ కాలేని వారి పాఠశాలలో నీడ్ పోస్టులకు బదిలీలు అయిన 15 రోజుల్లో వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేస్తారు.