ఆంధ్రప్రదేశ్‌

మోదీ ప్రగతి ప్రచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 8: తన నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఆయా ప్రభుత్వాలు తమ సొంతవిగా ప్రచారం చేసుకుంటున్నందున, ఇకపై తానే విస్తృతంగా వాటిని ప్రచారం చేసుకోవాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని, ప్రచారంతో పల్లెలలో పాగా వేయాలని భావిస్తోంది. ఈ తరహా ఎలక్ట్రానిక్ ప్రచార రథాలను కేంద్రం కంటే ముందే, బాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించినా అది మిగిలిన జిల్లాలకు విస్తరించడంలో విఫలమయింది.
అందులో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రగతి ప్రచార రథాలను గ్రామాలలో తిప్పాలని యోచిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రచార రథాలను ఎక్కువగా తిప్పాలని నిర్ణయించింది. ఒక ప్రత్యేక వాహనాన్ని రూపొందించి, వాటి చుట్టూ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేసి, వాటి ద్వారా నేరుగా మోదీ ప్రత్యక్ష ప్రసారాలు, గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించాలన్నది ఈ ప్రచార రథాల లక్ష్యం.
దానితోపాటు, కేంద్రం వివిధ వర్గాలకు అందచేస్తున్న సంక్షేమ పథకాల షార్టు ఫిలింలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ వాహనం ఒకటి కర్నూలు జిల్లాలో ప్రయోగాత్మకంగా తిప్పుతున్నారు. వీటికి గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ లభిస్తోంది. రాత్రి వేళ గ్రామ ప్రజలు ఆరుబయటకు వచ్చి వీటిని వీక్షిస్తున్నారు. దీనికి శాటిలైట్ లింకుతోపాటు, 2 జిబి సౌకర్యం కూడా ఉంది. మోదీ ఢిల్లీలో ఉండి నేరుగా ఏ గ్రామ ప్రజలతో మాట్లాడాలనుకుంటే, అక్కడ ఉన్న ఎల్‌ఈడీ ప్రచార రథాలు వెంటనే సిద్ధమవుతాయి. ఒకరకంగా ఇది కూడా వీడియో కాన్ఫరెన్సు లాంటిదే.
నిజానికి ఈ తరహా ఎల్‌ఈడీ వాహనాలను తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రయోగాత్మకంగా రూపొందించినా, ఏ కారణాల వల్లనో మిగిలిన జిల్లాలకు విస్తరించలేకపోయింది. అత్యాధునిక సాంకేతిక సౌకర్యంతో వాహనం ఏర్పాటుచేసింది. ప్రస్తుతం అది చిత్తూరు జిల్లాకే పరిమితమయినా, అక్కడ గ్రామాల్లో సమాచారశాఖ రూపొందించిన ఆ వాహనం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.
అయితే ప్రచారంలో అందరికంటే ముందుండే చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం కేంద్రంతో పోటీపడలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 80 ఎల్‌ఈడీ ప్రచార రథాలను తిప్పాలని నిర్ణయించింది. ఆ మేరకు కొన్ని సంస్థలకు ఆర్డరు ఇచ్చినట్లు సమాచారం.
అసలు ఈ తరహా ప్రచార ప్రయోగం పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే ప్రారంభమయింది. అయితే అప్పట్లో ఎల్‌ఈడీ లేకపోయినా, సినిమా ప్రొజెక్టర్ల ద్వారా స్క్రీన్లు ఏర్పాటుచేసి సినిమాలకు ముందు, మధ్య, చివరలో కేంద్రప్రభుత్వ పథకాలు ప్రచారం చేశారు. తర్వాత ఒడిశాలోనూ ఇలాంటి ప్రచార ప్రయోగం విజయవంతమయింది.