ఆంధ్రప్రదేశ్‌

ప్రతి ఐటిడిఏకు ఒక ఏరియా ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 8: గిరిజనుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. విశాఖలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఐటిడిఏ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏడు ఐటిడిఏ ప్రాంతాల్లో ట్రైబల్ రిఫాం యూర్డ్‌స్టిక్(ట్రై) కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పథకాలు సక్రమంగా అమలు చేస్తున్నప్పటికీ అక్కడి జీవన ప్రమాణాలు పెరుగుదల ఆశించినంతగా లేదని, మాతా, శిశు మరణాలు ఎక్కువుగా సంభవిస్తున్నాయని, వీటిని దృష్టిలోపెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందన్నారు. దీని కోసమే ప్రతిశాఖకు మూడు మాసాల లక్ష్యాలను నిర్దేశించి తగిన ప్రణాళికలను తయారు చేసినట్టు తెలిపారు. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఐటిడిఏ పరిధిలో ఒక ఏరియా ఆసుపత్రిని మంజూరు చేశామని, ప్రతి పిహెచ్‌సిని 24 గంటలు పనిచేసే విధంగా చర్య తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య సలహాదారు జితేంద్రశర్మ మాట్లాడుతూ దేశంలో గిరిజన ప్రాంతాలన్నింటిలో గిరిజనుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ట్రై కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య పెరగాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఐటిడిఏ పీవోలు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.