ఆంధ్రప్రదేశ్‌

శివానందమూర్తి ఒక ఆధ్యాత్మిక నిఘంటువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 10: సద్గురు శివానందమూర్తి నిరంతర సత్యానే్వషి అని, ఒక ఆధ్యాత్మిక నిఘంటువని పలువురు ప్రముఖులు కొనియాడారు. శివానందమూర్తి జీవిత సంగ్రహంపై శివానంద సుపథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండు రోజుల సదస్సు విశాఖ కళాభారతి ఆడిటోరియంలో శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ ప్రపంచ శాంతి, మానవాళి మనుగడకు సద్గురువుల ఆధ్యాత్మికమార్గం ఎంతో దోహదపడుతుందన్నారు. ఆధ్యాత్మికత, ఉపనిషత్తులు, జ్యోతిషం, చరిత్ర, భూగోళం వంటి అంశాల్లో శివానందమూర్తి ప్రజలకు దిశానిర్దేశం చేశారన్నారు. సప్తరుషుల జ్ఞానసంపద తానే కలిగిన మహోన్నత వ్యక్తి శివానందమూర్తి మాత్రమేనన్నారు. సద్గురువుల రచనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలన్నారు. రెండున్నర దశాబ్దాలుగా శివానందమూర్తితో తనకు సాన్నిహిత్యం ఉందని, గీతం యూనివర్శిటీ తొలి డాక్టరేట్‌ను సద్గురువులకు అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
ఆంధ్రాయూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య జి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ రాజకీయాలు, జాతీయ భద్రత తదితర అంశాలపై ఎంతో అవగాహన కలిగిన సద్గురు శివానందమూర్తి జ్ఞాన సముపార్జన అనిర్వచనీయమన్నారు. పర్యాటకశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వృత్తి ధర్నాన్ని పాటించడం, వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించి, సామాజిక స్పృహతో పనిచేయడం సద్గురు శివానందమూర్తి నుంచి నేర్చుకున్నానన్నారు. దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ మాట్లాడుతూ సనాతన ధర్మం, దేశభక్తి తదితర అంశాల్లో ఆయన స్ఫూర్తిని అలవరుచుకున్నానన్నారు. జగద్గురు పీఠం అంతర్జాతీయ అధ్యక్షుడు కె పార్వతీకుమార్, గరికపాటి నరసింహరావు తదితరులు ఈ సదస్సులో ప్రసంగించారు.

చిత్రం.. శివానంద యోగం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అతిథులు