ఆంధ్రప్రదేశ్‌

టిటిడికి జిఎస్‌టి మినహాయింపు ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 10: జిఎస్‌టి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి మినహాయింపునిచ్చే అధికారం ప్రస్తుతం రాష్ట్రానికి లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. శనివారం కల్యాణోత్సవం సమయంలో ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అన్నదానం, వసతి సౌకర్యాలపై వ్యాట్ మినహాయింపు ఇచ్చినట్లే జిఎస్‌టి నుంచి కూడా పన్ను మినహాయింపు కావాలని టిటిడి యాజమాన్యం కోరిందన్నారు. ఇప్పటికే ప్రసాదాలపై టిటిడికి మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే పన్నులు మినహాయింపుపై టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు కోరిన కోరికను రేపటి కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామన్నారు. జిఎస్‌టి కింద ఎంత పన్నులు ఉండాలన్నదానిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. నూతన శాసనసభలో ఎక్కడా వర్షపు నీరు లీక్ కాలేదని, అయితే జగన్ చాంబర్‌లో మాత్రమే నీరు ఎలా లీకయ్యిందో విజ్ఞులు ఆలోచించుకోవాలన్నారు. తిరుమలలో శ్రీవారి సన్నిధిలో పనిచేస్తున్న గొల్లసన్నిధి పురాతన హక్కుగా, సంప్రదాయంగా, వంశపారంపర్యంగా కొనసాగాలని యాదవ సంఘాల డిమాండ్ల మేరకు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. సున్నితమైన అంశాన్ని ముఖ్యమంత్రితో చర్చించి చట్టబద్ధంగా సానుకూల నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.
రాజకీయ ప్రభావాలను పరిశీలించేందుకు సబ్‌కమిటీ ఏర్పాటు అవసరం
విజయవాడ: అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీల నివేదికలపై తుది నిర్ణయం తీసుకునే ముందు రాజకీయ ప్రభావాలను పరిశీలించేందుకు వీలుగా జిఎస్‌టి సభ్యులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. జిఎస్‌టి నిబంధనలు, పన్నుల రేట్లు, మినహాయింపు, తదితర అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం జిఎస్‌టి కౌన్సిల్‌కు ఉందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జిఎస్‌టి అమలులో ఎదురయ్యే వివిధ అంశాలను, సమస్యలను అధ్యయనం చేసేందుకు వీలుగా అధికారులతో స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే అధికారులు కేవలం నిబంధనలు, ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే ఆయా సమస్యలను పరిశీలించి, నివేదికలను అందచేస్తారని తెలిపారు. అయితే ఈ నిర్ణయాల వల్ల ఆయా రాష్ట్రాల్లో ఎదురయ్యే రాజకీయ ప్రభావాలను అధికారులు పరిగణలోకి తీసుకోరన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జిఎస్‌టి కౌన్సిల్ సభ్యులతో ఒక సబ్‌కమిటీ తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు ఇచ్చిన నివేదికలను రాజకీయ ప్రభావం నేపథ్యంలో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.