ఆంధ్రప్రదేశ్‌

పచ్చగడ్డికి నోచుకోని పశువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు, జూన్ 11: గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజధాని అమరావతి ప్రాంతంలో పచ్చగడ్డికి కొరత ఏర్పడింది. గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించక ముందు ఈప్రాంతంలో ఏడాది పొడవునా పుష్కలంగా పచ్చగడ్డి లభించేది. కృష్ణానదీ తీరంలోని లంక గ్రామాల్లో బోర్ల ద్వారా నీటిని తోడి మూడు కాలాల్లోనూ పంటలు పండించేవారు. మెట్ట ప్రాంతంలో ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటిని పొలాలకు అందించేవారు. దీంతో వేసవిలో సైతం పచ్చగడ్డికి కొరత ఉండేది కాదు. రాజధానిగా ప్రకటించిన తర్వాత కూడా పొలాల్లో పైరులేని కారణంగా పశుగ్రాసానికి ఇబ్బందులు ఏర్పడలేదు. ప్రస్తుతం రహదారుల నిర్మాణ పనులు చేపట్టటంతో పాటు భూసమీకరణలో ప్రభుత్వానికి భూములు అప్పగించిన రైతులకు ప్లాట్ల పంపిణీ కోసం పొలాల్లోని చెట్లను తొలగించటంతో పాటు పంటకాల్వలు, నీటి కుంటలను పూడ్చేస్తున్నారు. ప్లాట్లకు పెగ్ మార్కింగ్ వేసేందుకు నేలను చదును చేస్తున్నారు. దీంతో కనుచూపు మేరలో ఎక్కడా పచ్చగడ్డి కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు పల్లపు ప్రాంతాల్లో గడ్డి పరకలు మొలుస్తున్నాయి. గ్రాసం కోసం పొలాల్లోకి వెళుతున్న పశువులు గడ్డి పరకలు లాగటానికి నోటికి అందక, ఆకలి తీరక అల్లాడిపోతున్నాయి. వాటి పరిస్థితి చూసి పశువుల పెంపకందారులు, పాడి రైతులు విలవిల్లాడిపోతున్నారు.