ఆంధ్రప్రదేశ్‌

భర్తీకానీ ఇంజనీరింగ్ సీట్లను స్వచ్ఛందంగా ఇచ్చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 11: రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టుకురావడం, ఇంజనీరింగ్ పరీక్ష రాసిన విద్యార్థుల కంటే సీట్లు అధికంగా ఉండటం వల్ల ప్రతీ ఏటా వేలాది సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు అదనంగా ఉన్న సీట్లను స్వచ్ఛందంగా ఇచ్చేయాలని జెఎన్‌టియు(కె) కోరింది. దీంతో జెఎన్‌టియుకె పరిధిలోని ఎనిమిది జిల్లాల ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు అదనంగా ఉన్న సీట్లను వెనక్కి ఇచ్చేశాయి. ఈ విధంగా జెఎన్‌టియు(కె) పరిధిలో 21050 ఇంజనీరింగ్ సీట్లు తగ్గాయని జెఎన్‌టియు(కె) అకాడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సిహెచ్‌వి సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఇంజనీరింగ్‌లో సిఎస్‌ఇ, ఈఈఈ, ఇసిఇ, మెకానికల్, సివిల్ బ్రాంచిలలో కొన్ని కళాశాలల్లో సగం సీట్ల భర్తీకాని పరిస్థితి ఉంది. కాగా, అత్యధిక సీట్లు ఉన్న కళాశాలల్లో కొన్ని గ్రూపులకు ఎక్కువ డిమాండ్ ఉండగా, మరికొన్నింటిలో సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఉంది. అందుకే వివిధ కళాశాలు అదనంగా ఉన్న సీట్లను చాలావరకు వదలుకున్నాయి. కాగా, ట్రిపుల్‌ఇ సీట్లకు డిమాండ్ తగ్గడంతో ఎక్కువ కళాశాలలు ఈ విభాగంలో సీట్లను ఇచ్చేశాయి. విజయనగరం జిల్లాలో మూడు వేల సీట్లు రద్దయినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలు వెలిశాయి. ఆ తరువాత నుంచి కళాశాలలు ప్రభుత్వం నుంచి బోధనా రుసుములను దక్కించుకునేందుకు నానా యాతనలు పడుతున్నాయి. ఈ ఏడాది భారీగా సీట్లు తగ్గడంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.