ఆంధ్రప్రదేశ్‌

జపాన్ కంపెనీలకు హెడ్ క్వార్టర్స్‌గా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: భారత్‌లో జపాన్ కంపెనీలన్నింటికీ అమరావతినే ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జైకా, మేటీలకు సూచించారు. జపాన్‌కు చెందిన ఈ రెండు సంస్థలు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్టుగా ఏపీలో కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ఆయన ప్రతిపాదించారు. శ్రీసిటీ లేదా కృష్ణపట్నంలో జపాన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సోమవారం సాయంత్రం మేటీ, జైకాలకు చెందిన బృందం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఏపీలో తమ ప్రాజెక్టుల పురోగతిని వివరించింది. జూలై 12న జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రి యోసుకా టకగీ అమరావతికి రానున్నారు. 20 మంది ప్రభుత్వ ప్రతినిధులు, మరో ఇరవై మంది వాణిజ్య ప్రతినిధులు టకగీ వెంట ఇక్కడకు రానున్నారు. ఈలోపే ఐసిటి., స్పోర్ట్స్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ మాస్టర్ ప్లాన్లను రూపొందించే పనిని పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జపాన్ బృందానికి సూచించారు. కొత్త రాజధానిలో రవాణా వ్యవస్థ అభివృద్ధిపై జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యతరహా ప్రణాళిక, వ్యూహాలను రూపొందిస్తోంది. అదే విధంగా అమరావతి నగరం కోసం ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ఇవే గాకుండా, రాజధాని నగరంలో తలపెటిటన స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్ సిటీలకు బృహత్తర ప్రణాళికలను తయారుచేస్తోంది. వీటన్నింటితోపాటు ఏపీలో అభివృద్ధి చేయనున్న జపనీస్ ఇండస్ట్రియల్ క్లస్టర్ల అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. గత ఏడాది మే నెలలో జపాన్ మంత్రి టకగీ నేతృత్వంలో జపాన్ పారిశ్రామిక బృందం ఇక్కడ పర్యటించి అమరావతిలో వౌలిక వసతుల అభివృద్ధిలో పాలు పంచుకోడానికి ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. దాంతోపాటు ప్రజారాజధానిలో స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్ సిటీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడానికి జైకా, మేటీ నడుం కట్టాయి. ముఖ్యమంత్రిని కలిసిన జపాన్ బృందంలో జైకాకు చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎజిమా షిన్యా, ఢిల్లీలో ఆ సంస్థ ప్రతినిధి టక యోషీ టాంగే, మరో ప్రతినిధి మొమోకో పురుహషీ, మేటీకి చెందిన ఏషియన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ప్రమోషన్ డైరక్టర్ జనరల్ హరుహికో అండో, సౌత్ వెస్ట్ ఆసియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఇచిరో అబే, తదితరలు ఉన్నారు.