ఆంధ్రప్రదేశ్‌

సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: రాష్ట్రంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేసేందుకు సిఎం చంద్రబాబు స్ఫూర్తితో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కల్సి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఎపిఎస్‌ఐడిసి) చైర్మన్‌గా సోమవారం నాడిక్కడ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ తెలిపారు. చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత గత మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.40వేల కోట్లు కేటాయించారన్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో ఇప్పటివరకు రాష్టవ్య్రాప్తంగా 48వేల కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీసి 33 టిఎంసిల మేర భూగర్భ జలాలను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. దీనివల్ల 3లక్షల 40వేల ఎకరాల ఆయకట్టును అదనంగా స్థిరీకరించడం జరిగిందన్నారు. కెఇ ప్రభాకర్ బాధ్యతల స్వీకరణకు రాయలసీమ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఉప ముఖ్యమంత్రులు కెఇ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపి కొనకళ్ల నారాయణ, తదితరులు ప్రభాకర్‌ను అభినందించారు.