ఆంధ్రప్రదేశ్‌

బంగ్లాదేశ్ వద్ద తీరం దాటిన అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 12: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బంగ్లాదేశ్ వద్ద సోమవారం ఉదయం తీరం దాటిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రస్తుతం అగర్తలాకు వాయువ్య దిశగా 30 కిమీ దూరంలో కేంద్రీకృతమై, వచ్చే 12 గంటల్లో మరింత బలహీనపడుతుందని పేర్కొంది. ఈ సందర్భంలో కోస్తాలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తా వెంబడి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లే మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.