ఆంధ్రప్రదేశ్‌

ఆత్మహత్యలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: పంటలు పోయాయనో, అప్పుల పాలయ్యామనో ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక పంట కాకపోతే మరో పంటకైనా రైతుల్ని గట్టెక్కించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అవసరమైతే వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ నిధులకు మించి ఖర్చు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తోందన్నారు. ధనిక రాష్ట్రాలు కూడా అమలుచేయలేని రుణమాఫీని అమలుచేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. రూ.3,350 కోట్ల విలువైన ఉచిత విద్యుత్‌ను రైతులకిస్తున్నామని, లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు, ఆపైన ఎంత కావాలన్నా పావలా వడ్డీకే రుణాలిస్తున్నామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. రాష్ట్ర రైతులకు 120 కోట్ల రూపాయల విలువైన సూక్ష్మ పోషకాలను ఉచితంగా అందివ్వాలని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. సాధారణంగా రాష్ట్రంలో ఆరు లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరుగుతుందని, రేటు పడిపోయి రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతో మిగిలిన పంటల సాగు వైపు ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇలా ఇతర పంటలు సాగు చేయాలనుకునే పత్తి రైతులకు పురుగు మందులు, కలుపు నివారణ మందులకు ఇచ్చే రాయితీని 33 నుంచి 75 శాతానికి పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇలా లక్షన్నర హెక్టార్ల వరకు ఈ రాయితీలను అందజేస్తామన్నారు. 20 మీటర్ల లోతు వరకు జల వనరులు అందుబాటులో లేని రైతులకు సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థ కింద 90 శాతం రాయితీతో పరికరాలు అందజేయనున్నట్టు చెప్పారు. ఉద్యానవన రంగం అభివృద్ధి కోసం ఈ ఏడాది 1170 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు వివరించారు.
వ్యవసాయ యంత్ర పరికరాల కోసం ఇచ్చే రాయితీని 407 కోట్ల రూపాయలకు పెంచినట్టు తెలిపారు. అలాగే రైతు రథం పథకం కింద ఒక్కో జిల్లాకు సగటున 500 ట్రాక్టర్ల చొప్పున మొత్తం 6,600 ట్రాక్టర్లు అందజేయాలని నిర్ణయించామన్నారు. ఈ పథకం కింద ఒక్కో రైతుకు రెండు లక్షల రూపాయలకు పైగా రాయితీ దక్కుతుందన్నారు. మిర్చి రేటు పడిపోతే అదనపు ధర ఇచ్చి కొనుగోలు చేయడంతోపాటు మూడు లక్షల క్వింటాళ్ల పసుపు కొనుగోలు చేశామని, కందులు, మినుము కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నామన్నారు.
ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి 1680 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. అలాగే వర్షపాతం తక్కువగా ఉండే అనంతపురం జిల్లాలో అడిగిన వాళ్లందరికీ వంద శాతం రాయితీతో సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ కింద పరికరాలు అందజేయాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో ఏపి అగ్రోస్ ఎండి మాధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.