ఆంధ్రప్రదేశ్‌

పాముల్ని ఇట్టే పట్టేస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని టౌన్, జూన్ 12: ఒకటి రెండు కాదు ఏకంగా రెండు వేల పాములు పట్టుకుని అడవుల్లో వదిలేశాడు బాషా. ఎలాంటి పామునైనా ఇట్టే పట్టుకుంటాడు. తన తండ్రి నుంచి పాములు పట్టే నైపుణ్యం నేర్చుకున్నట్లు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహబూబ్‌బాషా చెబుతుంటాడు. వంశపార్యపరంగా తమది పాములుపట్టే వృత్తి అని, అల్లా దయ వల్ల ఇప్పటివరకు పాముకాటుకు గురి కాలేదన్నారు. గత 15 సంవత్సరాల్లో 2 వేల పాములను పట్టుకుని అడవుల్లో వదిలి పెట్టినట్లు తెలిపాడు. ఆదోని పట్టణంలోని మహవీర్‌కాలనీలో ఉంటే బాషా ఎవరు ఫోన్ చేసినా క్షణాల్లో అక్కడికి చేరుకుని ఎంతటి పామునైనా అవలీలగా పట్టుకుండాడు. అనంతరం దాన్ని అడవుల్లో వదిలేస్తుంటాడు. సోమవారం పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని ఓ ఇంట్లో పాము ఉన్నట్లు ఫోన్ రాగానే అక్కడికి చేరుకుని దాన్ని పట్టుకున్నాడు. సుమారు ఏడు అడుగులు ఉన్న ఈ పామును పట్టణ శివారులోని అడవిలో వదిలి పెట్టినట్లు తెలిపాడు. పాములను ఎవరూ చంపరాదని బాషా చెబుతుంటాడు. అవి మూగజీవాలను, ప్రాణాలమీదికి వచ్చినపుడే అవి కాటు వేస్తాయని వివరిస్తున్నాడు.