ఆంధ్రప్రదేశ్‌

ఉచితంగా సూక్ష్మ పోషకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు రైతులకు సూక్ష్మ పోషకాలను ఉచితంగా అందివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. భూ అవసరాలకు అనుగుణంగా సూక్ష్మ పోషకాల పంపిణీ జరగాలని సూచించారు. ఎరువులు, సూక్ష్మ పోషకాల పంపిణీలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే పీడి యాక్ట్ కింద కేసులు నమోదుచేయాలని స్పష్టం చేశారు. అలాగే ఈనెల 16న రెయిన్‌గన్లను ప్రయోగాత్మకంగా వినియోగించాలని చెప్పారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత ఎక్కడా లేదని, ఈసారి వ్యవసాయరంగ వృద్ధి అధికంగా ఉండాలని నిర్దేశించారు. గత ఏడాది 30 శాతం తక్కువగా వర్షపాతం నమోదైనా వ్యవసాయ రంగంలో 14 శాతం వృద్ధి సాధించగలిగామని గుర్తుచేశారు. నీరు-ప్రగతి, వ్యవసాయ రంగం, పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులకు సంబంధించి జలవనరులు, వ్యవసాయశాఖల అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో నాలుగున్నర గంటల పాటు సమీక్ష జరిపారు. 13 జిల్లాల కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీరు-ప్రగతికి సంబంధించి లక్ష్యాలు ఎంతవరకు చేరుకున్నది ఆయా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నీరు-ప్రగతి 90 రోజుల కార్యక్రమం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిచేసేందుకు ఇంకా 38 రోజుల సమయమే మిగిలి ఉందని, పనుల్లో మరింత వేగం పెంచాలని అన్నారు. గోదావరి డెల్టాకు ఈ సీజన్‌లో ముందుగానే నీటిని విడుదల చేశామని, కృష్ణాడెల్టాలో సైతం నారుమళ్లు వేయడం త్వరగా పూర్తయ్యేలా చూడాలని, ఇందుకోసం అవసరమైతే సీలేరు నుంచి నీటిని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఖరీఫ్ సాగుపై అన్ని జిల్లాల కలెక్టర్లు దృష్టి పెట్టాలని, నారుమళ్లు ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు. గ్రావిటీ, మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులను, చెక్ డ్యాంలను నీటితో నింపాలని చెప్పారు. అన్ని చెరువులను నీటితో నింపడం, భూగర్భ జలాలు పెంచడం మనందరి బాధ్యత అన్నారు. ఈ ఏడాది 31వేల పంట కుంటలు మాత్రమే ఇవ్వగలిగామని, త్వరగా మిగిలిన లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పారు. నీరు-ప్రగతి 90 రోజుల కార్యక్రమం కింద రాష్ట్రంలో మొత్తం 7,380 చెక్ డ్యాంలు నిర్మించాలని తలపెట్టగా 1,213 చెక్‌డ్యాంల నిర్మాణం ముగింపు దశకు చేరుకున్నాయని, ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు రూ.314.60 కోట్ల విలువైన పనులు పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతపురం, నెల్లూరు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వరకు ప్రస్తుతం సాధారణ వర్షపాతం నమోదవుతోందని, ఈనెల 19 నుంచి రాష్టమ్రంతటా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
తక్షణం నీరు-చెట్టు బిల్లుల చెల్లింపు
నీరు-చెట్టు కింద ఉన్న పెండింగ్ బిల్లులను తక్షణం క్లియర్ చేయాలని అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ఈనెల 14న ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. నాలుగైదు రోజుల్లో ఇన్‌పుట్ సబ్సిడీ రైతులు అందరికీ చేరాలని, ఇందుకోసం గ్రామసభలు నిర్వహించాలని సూచించారు.

చిత్రం.. జలవనరులు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి