ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. కృష్ణా జిల్లా నందిగామ పోలీసుస్టేషన్‌లో జగన్ ప్రభుత్వాధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారన్న అభియోగంపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. నందిగామలో ఫిబ్రవరి 28వ తేదీన ప్రభుత్వాధికారులపై జగన్ మరో 14 మంది దురుసుగా ప్రవర్తించారని, దౌర్జన్యం చేశారనే అభియోగంపై కేసు నమోదైంది. పెనుగంచిప్రోలు వద్ద బస్సు దుర్ఘటనకు సంబంధించి బాధితులను జగన్ పరామర్శించారు. ఈ ఘటన సందర్భంగా స్ధానిక వైద్యాధికారి, జిల్లాకలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారని జగన్‌పై ఆరోపణ రావడంతో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని దాఖలైన పిటిషన్లను హైకోర్టు జడ్జి ఎ.శంకర్ నారాయణ కొట్టివేశారు. ఈ కేసులో పోలీసులు ఇంతవరకు చార్జిషీటు దాఖలు చేయలేదని, చార్జిషీటుదాఖలు చేసిన తర్వాత పిటిషన్ దాఖలు చేయవచ్చని జడ్జి సూచించారు. ఈ తరహా కేసులో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడి సెక్షన్ 41 సిఆర్‌పిసిని అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.