ఆంధ్రప్రదేశ్‌

వేసవి కాలంలో భారీగా పెరిగిన విద్యుత్ వాడకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 13: ఈ ఏడాది వేసవిలో విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరిగింది. మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో దాదాపు ఐదు వేల మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వాడకం జరిగింది. ఇది గత ఏడాది కంటే 500 మిలియన్ యూనిట్లు ఎక్కువని సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి ప్రతిరోజూ కనీసం 50 మిలియన్ యూనిట్ల వాడకం ఉంటుంది. ఇది వేసవిలో కాస్త పెరుగుతుంది. ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి మే నెలాఖరు వరకు 90 రోజులపాటు వేసవి సీజన్ మొత్తం మీద చూస్తే దాదాపు ఐదు వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరిగినట్టు సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ విధంగా చూస్తే సగటున రోజుకు 50 ఎంయు విద్యుత్ వాడకం జరిగింది. నెలకు 1500 మిలియన్ యూనిట్లుకాగా, గత నెలలో మాత్రం ఇది పెరిగి దాదాపు 1900 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. మార్చిలో 1500 ఎం.యు, ఏప్రిల్ దాదాపు 1600 ఎంయు, మేలో 1800మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరిగింది. ఇందులో విశాఖ జిల్లాకు సంబంధించి పరిశ్రమలు అధికంగా ఉన్నందున మార్చిలో 543 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్‌లో 535 ఎంయు, మేలో 603లో మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వాడినట్టుగా లెక్కలు నమోదయ్యాయి. ఈ విధంగా మూడు మాసాల మొత్తం మీద 1682 మిలియన్ యూనిట్లకు వాడకం చేరుకుంది. గత ఏడాది ఐదు జిల్లాలకు సంబంధించి దాదాపు నాలుగు వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడకం జరిగింది. అయినా మిగులు విద్యుత్ ఉన్నందున కోతల్లేని, మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేయగలిగామని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. మూడు మాసాల్లో కేవలం ఒకేరోజు సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన సబ్‌స్టేషన్లలో సాంకేతిక లోపంతోనే ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. భవిష్యత్‌లో సాంకేతికపరమైన సమస్యలు అధిగమించేందుకు అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన విద్యుత్ పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది.
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తగ్గింపు
వచ్చే ఏడాది వేసవి సీజన్‌లో ఎండల తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలున్నందున దీనికనుగుణంగా అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకోవాలని సంస్థ నిర్ణయించింది. వచ్చే ఏడాది వేసవిలో మరో వెయ్యి మిలియన్ యూనిట్ల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్న సంస్థ ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తోంది. ఇందులో భాగంగా ఇంధన పొదుపు, నాణ్యమైన పరికరాల వాడకం, సోలార్ విద్యుత్‌ను మరింతగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా విద్యుత్ డిమాండ్‌ను తగ్గించుకోవాలని ఆలోచన చేస్తోంది.