ఆంధ్రప్రదేశ్‌

రూ.1.50 కోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 13: ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన జివిఎంసి సూపరింటెండెంట్ వెంపడాపు అచ్చెన్నాయుడు ఇంటిపై ఎసిబి అధికారులు మంగళవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం రూ.1.50 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి వీటి మార్కెట్ విలువ 15 కోట్లు పైగా ఉంటుందని అంచనా. ఎసిబి డిఎస్పీ షకీలాబాను నేతృత్వంలో అచ్చెన్నాయుడు నివసిస్తున్న ఇల్లు, బంధువుల ఇళ్లపై దాడులు జరిపారు. పట్టణంలోని పిఎస్‌ఎన్ కాలనీ, డెంకాడ, గుణుపూరుపేట, జమ్ము ప్రాంతాల్లో దాడులు చేయగా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో దాదాపు రూ.86 లక్షల విలువైన ఇళ్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు పట్టణంలోని తోటపాలెంలో 85 చదరపు అడుగుల జి ప్లస్ 2 భవనం, సాయినగర్‌లో మరో 84 చదరపు అడుగుల స్థలం, తోటపాలెంలో మరో 83.33 చదరపు అడుగుల శ్లాబు ఇల్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అలాగే వ్యవసాయ భూములకు సంబంధించి డెంకాడ మండలంలో మొత్తం 4.05 ఎకరాలు, జమ్మునారాయణ పురంలో 0.25 సెంట్ల వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. ఇవి గాకుండా డెంకాడ మండలం పెదతాడివాడలో రెండు ఇళ్లు, విజయనగరంలోని గాజులరేగలో 485 చదరపు గజాల స్థలం, జమ్మునారాయణ పురంలో 121.5 చదరపు గజాల స్థలం, ద్వారపూడిలో 300 చదరపు గజాల స్థలం, విశాఖలోని విశాలాక్షినగర్‌లో 500 గజాల స్థలం, చోడవరం మండలం కండేపల్లిలో 167 చదరపు గజాల స్థలం, డెంకాడ మండలం పెదతాడివాడలో 563 చదరపు గజాల రెండు స్థలాలు, చైతన్యనగర్ లే అవుట్‌లో 174 చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఉన్నట్టు గుర్తించారు. దాంతోపాటు రూ.11.84 లక్షల విలువైన 730 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి, రూ.3 లక్షల నగదు, రూ.2.50 లక్షల బ్యాంకు నిల్వలు గుర్తించామని ఎసిబి డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.

చిత్రం.. జివిఎంసి సూపరింటెండెంట్ వెంపడాపు అచ్చెన్నాయుడు