ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడిలేని ప్రకృతి సేద్యానికే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, జూన్ 13: పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ విధాన రూపకర్త సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం-పాలేకర్ విధానం అనే సదస్సులో ఆయన మాట్లాడుతూ పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కువ చొరవ చూపిస్తున్నారని వివరించారు. ఈ విధానాన్ని వెంటనే అమలు చేయడం కష్టమేనన్నారు. వ్యవసాయ పరంగా వ్యవస్థలో మార్పును వెంటనే అంగీకరించే స్థాయి రైతుల్లో లేదన్నారు. అందుకోసమే జనవరి మాసంలో అమరావతిలో ఎనిమిది రోజుల శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నేల సారమే దిగుబడి శక్తిఅని, భూసారం పెరిగితే దిగుబడి పెరుగుతుందన్నారు. రసాయనిక వ్యవసాయంతో పండించిన ఆహారధాన్యాలు తినడం వల్ల షుగర్, బీపీ, గుండె జబ్బులు, కాన్సర్ వంటి రోగాలు ప్రబలి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూసారం, దిగుబడి శక్తి పెరగాలంటే జీవనద్రవ్యం పెరగాలన్నారు. జీవనద్రవ్యం పెట్టుబడిలేని వ్యవసాయంతో తయారవుతుందన్నారు. పంటల్లో అంతర పంటలు వేసినప్పుడు ఆకులు రాలిపోతాయని, వాటివల్ల జీవనద్రవ్యం తయారవుతుందన్నారు. అదే విధంగా మొక్కలకు మేలుచేసే సూక్ష్మజీవులు కూడా పంటలకు మేలుచేస్తాయని అన్నారు. ఈ జీవనద్రవ్యం వేరు ప్రాంతంలో తయారవుతుందన్నారు. వేర్లు, సూక్ష్మజీవులు కలిసి మొక్కల రోగ నిరోధక శక్తిని పెంచుతాయన్నారు. వర్మీకంపోస్టు, కంపోస్టు వల్ల జీవనద్రవ్యం మొక్కకు అందదని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం నేల, నీటి, వాతావరణాన్ని కలుషితం చేసి, మనుషుల ఆరోగ్యాన్ని పాడు చేస్తుందన్నారు. సేంద్రియ వ్యవసాయం విదేశీ వ్యవసాయమన్నారు. రసాయనిక వ్యవసాయ విధానం కన్నా సేంద్రియ వ్యవసాయం దోపిడీ చేసే వ్యవసాయమన్నారు. ప్రస్తుతం పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విధానంలో ఒక్క దేశవాళి ఆవుతో 30ఎకరాల వరకు సాగుచేయవచ్చన్నారు. నాటు ఆవు ఉంటే ఒక్క గ్రాము ఎరువులు కొనుగోలు చేయాల్సిన పనిలేదన్నారు. విత్తనాలు కూడా కొనుగోలు చేయాల్సిన పనిలేదని, స్థానికంగా విత్తనాలు అందిస్తామని పాలెకర్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రసం పీల్చే పురుగులు దాడి చేయలేవన్నారు.
రైతులకు తాత్కాలిక చర్యలు కాదు..శాశ్వత పరిష్కారం కావాలని ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. వ్యవసాయంలో కీలకమైన రోజులు వచ్చాయని అన్నారు. వ్యవసాయం అంటే నష్టపోతామనే భయంతో రైతులు ఉన్నారన్నారు. అదే విధంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెల్లోని రైతులు వ్యవసాయం మానుకుని, పట్టణాలకు చేరుకుంటున్నారని అన్నారు. సేంద్రియ వ్యవసాయం, రసాయనిక వ్యవసాయం, సాంప్రదాయక వ్యవసాయంలో ఎలాంటి లాభాలులేవని, పెట్టుబడి లేని పాలేకర్ వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపాలని సూచించారు.