ఆంధ్రప్రదేశ్‌

జిఎస్టీకి నిరసనగా నేడు వస్త్ర వ్యాపారుల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జిఎస్టీకి నిరసనగా ఈ నెల 15న రాష్టవ్య్రాపితంగా వస్త్ర దుకాణాల బంద్ పాటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి తెలిపారు. ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వస్త్రాలపై విధించిన జిఎస్టీకి వ్యతిరేకంగా ఆలిండియా జిఎస్టీ సంఘర్షణ సమితి గురువారం వస్త్ర వ్యాపారుల దేశవ్యాపిత సమ్మెకు పిలుపునిచ్చిందని చెప్పారు. సంఘర్షణ సమితికి ఎపి టెక్స్‌టైల్ ఫెడరేషన్ మద్దతు పలికి రాష్టవ్య్రాపిత సమ్మెకు తాము పిలుపునిచ్చామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తరువాత అంత భారీ సంఖ్యలో వస్త్ర వ్యాపారంపై ప్రజలు ఆధారపడి ఉన్నారన్నారు. వస్త్ర దుకాణాలు, రెడీమేడ్, టైలరింగ్ వంటి అనుబంధ విభాగాలతో కలిసి రాష్ట్రంలో సుమారు కోటి మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. జిఎస్టీ విధానంతో వస్త్రాలపై భారీగా పన్ను భారం పడుతుందన్నారు. దానికితోడు అధికారుల వేధింపులు కూడా పెరిగే అవకాశముందన్నారు. ముఖ్యంగా ఉత్పత్తి కేంద్రం వద్ద 18 శాతం, అక్కడి నుంచి చీరకు ఏదైనా ఎంబ్రాయిడరీ వంటి పని జరిగితే మరో 18 శాతం, ప్రింటింగ్, డైయింగ్ ఇలా ప్రతిచోట పన్ను విధింపు జరుగుతుందన్నారు. ఫలితంగా 50 శాతం వరకు పన్ను పడే అవకాశముందన్నారు. తాము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అందరూ అంగీకరించే పన్నును ఉత్పత్తి స్థానం నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం అంగీకరించేంత వరకు తాము పోరాడతామన్నారు. విలేఖరుల సమావేశంలో ఫెడరేషన్ కోశాధికారి వెలంపల్లి రామచంద్రరావు, నాయకులు బిజెపి శ్రీనివాస్, బచ్చు వెంకటప్రసాద్, వాగిచర్ల బాలప్రసాద్, వల్లంకొండ ప్రసాద్ పాల్గొన్నారు.