ఆంధ్రప్రదేశ్‌

సోషల్ మీడియాలో అత్యాచార బాధితురాలి ఫొటో !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 14: ఇటీవల అత్యాచారానికి గురైన ఒక బాలిక ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఫోటో ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టుకావడం విమర్శలకు తావిస్తోంది. బాధితురాలిని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లగా ఆమెతో మాట్లాడిన బాబు సదరు బాధితురాలి చెప్పిన విషయాలు విని చలించిపోయారు. అధైర్యపడాల్సిన పనిలేదని, తానున్నానని, ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చి ఆర్ధిక సాయం ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే, ఆ వైనానికి సంబంధించిన ఫొటో సీఎం బాబు వ్యక్తిగత ట్విట్టర్‌లో ఉంచడం ద్వారా ఐటి విభాగం ఆయనను విమర్శల్లోకి లాగింది. అత్యాచారానికి గురైన వారి ఫొటోలుగానీ, పేర్లు గానీ బహిరంగపరచకూడదని, అలా చేయడం నేరమన్న విషయం తెలియని ఐటి అధికారులు ఎంచక్కా బాబును కలిసిన బాధితురాలి ఫొటో ఉంచడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత దానిని తొలగించినప్పటికీ, బుధవారం సోషల్ మీడియాలో అదే చర్చనీయాంశమయింది. ‘సీఎంకు ఆ మాత్రం తెలియదా? అధికారులేం చేస్తున్నారం’టూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. నిజానికి ఈ వ్యవహారంతో బాబుకు సంబంధం లేకపోయినా నిబంధనల గురించి తెలియకపోవడం, అది తప్పని చెప్పేవారెవరూ లేకపోవడం ఇంత రచ్చకూ కారణమయింది. ట్విట్టర్‌లో జరిగిన రచ్చకు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమంటున్నారు. సీఎం ట్విట్టర్‌ను ఐటి విభాగమే నిర్వహిస్తోందని చెబుతున్నారు.