ఆంధ్రప్రదేశ్‌

డిఎ బకాయిలపై నేడు కేబినెట్ సమావేశంలో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతల డిఎ బకాయిలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా వేతన సవరణకు సంబంధించిన ఎరియర్స్‌పై కమిటీని నియమించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం తనను కలిసిన ఎన్జీవో నేతలకు హామీ ఇచ్చారు. ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు పి అశోక్‌బాబు నేతృత్వంలో అసోసియేషన్ నేతలు బుధవారం సచివాలయంలో ఆర్థికమంత్రి యనమలను కలిశారు. జూలై 2016, జనవరి 2017న మంజూరు చేయాల్సిన డిఎలను ఇంతవరకు మంజూరు చేయకపోవడం వల్ల ఉప్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, దీంతో పాటు వేతన సవరణకు సంబంధించి ఎరియర్స్‌ను కూడా మంజూరు చేయాలని ఈ సందర్భంగా అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా డిఎ బకాయి మంజూరులో జాప్యం జరిగిన మాట వాస్తవమైనప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. డిఎ బకాయి మంజూరుపై గురువారం ముఖ్యమంత్రి నేత్వత్వంలో జరగనున్న క్యాబినెట్ సమావేశం నందు చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పిఆర్‌సి ఎరియర్స్‌కు సంబంధించి కమిటీని నియమిస్తామన్నారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం నివేదిక ఆధారంగా ఎరియర్స్ మంజూరుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్థిక మంత్రిని కలిసిన వారిలో ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర రెడ్డి, పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ ఉన్నారు.