ఆంధ్రప్రదేశ్‌

కబ్జాల హబ్‌గా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 14: ఐటి హబ్‌గా మార్చి విశాఖను దేశంలో నెంబర్ వన్ పర్యాటక, సాంకేతిక రాజధానిగా నిలబెట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయం కబ్జాదారుల దూకుడు వల్ల నెరవేరేలా కనిపించడం లేదు. స్వయంగా అధికారపార్టీకి చెందిన ప్రభుత్వ ప్రముఖులే కబ్జాలకు కర్త,కర్మ,క్రియగా అవతారమెత్తిన ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం కబ్జాల రూపంలో ప్రముఖుల జేబుల్లోకి చేరుతోంది. ఉత్తరాంధ్రలో తిరుగులేని బలంతో ఉన్న పార్టీకి కబ్జామరకలు రానున్న ఎన్నికల్లో అప్రతిష్ఠగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. తాజాగా విశాఖలో జరుగుతున్న భూదందాలపై సీబీఐ, సీబీసీఐడి విచారణ జరిపించాలంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి రాసిన లేఖతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టయింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత భూ దందాలు విచ్చలవిడి కావడంతో వ్యక్తిగతంగా సీఎం చంద్రబాబు, సంస్థాగతంగా తమ పార్టీ ఇమేజీకి భారీ డ్యామేజీగా మారిందని పార్టీ సీనియర్లు వాపోతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి, రుషికొండ, తాజాగా బొత్సపేట, బి.తాళ్లవలస, మరో రెండు గ్రామాల్లోని వేలాది ఎకరాలను అధికారపార్టీ నేతలే కబ్జాదారుల అవతారమెత్తి దండుకుంటున్న తీరు, వాటికి సాక్షాత్తూ క్యాబినెట్ రాజముద్ర వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి.
విశాఖ పెందుర్తి మండలం ముదపాకలో 1,38, 76 సర్వే నెంబర్లలోని 955 ఎకరాల అసైన్డ్భూములను కొల్లగొట్టేందుకు జరిగిన ప్రయత్నాలను బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు బయటపెట్టడంతో, కొనే్నళ్ల నుంచి విశాఖలో జరుగుతున్న భూదందా వెలుగుచూసింది. ఈ క్రమంలో సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా ముందుకొచ్చి, బయటి నుంచి వచ్చిన వారే విశాఖ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని, వారికి పోలీసులు కూడా సహకరిస్తున్నారంటూ పరోక్షంగా గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వాటిపై విచారణ జరిపించాలన్న అయ్యన్న డిమాండ్‌పై అటు ప్రభుత్వం నిన్నటి వరకూ స్పందించకుండా, సిట్ వేయడం విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారాన్ని సీఐడికి ఇవ్వకుండా నాన్చడం, కలెక్టర్ అనూహ్యంగా తెరపైకి వచ్చి, కబ్జా వాస్తవమేనని చెప్పి, తర్వాత దానిని 13ఎకరాలేనని మాట మార్చటం సహజంగానే అనుమానాలకు తావిచ్చింది. ఈ కబ్జా ఖరీదు దాదాపు లక్ష కోట్ల వరకూ ఉంటుందని ఓ అంచనా. విశాఖలో పర్యటించిన వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఈ వ్యవహారంలో మంత్రి గంటాశ్రీనివాస్, లోకేష్‌తో పాటు, టిడిపి ఎమ్మెల్యేల పాత్ర ఉందని బాంబు పేల్చారు. టిడిపి ఎమ్మెల్సీ, గీతం వర్శిటీ అధినేత ఎంవిఎస్ మూర్తి ఎండాడ, రుషికొండ గ్రామాల్లోని సర్వే నెంబర్లు 15పి, 16పి, 19పి, 20పి, 55పి, 61పి, 34,35, 38 వరకూ ఉన్న 55.24 ఎకరాల భూమిని కబ్జా చేసుకుని, వాటిని నామమాత్రపు ధరకు ఇవ్వాలన్న దరఖాస్తుకు వాయువేగంతో కాళ్లొచ్చి, దానికి క్యాబినెట్‌లో ఆమోదరూపం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఇదే దరఖాస్తును కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వోతోపాటు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు తిరస్కరించటం గమనార్హం. ఇప్పుడు అధికారుల స్వామిభక్తి అదే దరఖాస్తును కేబినెట్ ఆమోదానికి సిద్ధం చేసింది. జాతీయ రహదారికి కేవలం 3కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభం మండలం లోని బొత్సపేట, బి.తాళ్లవలస, మల్లంవారి లింగన్న గ్రామాల్లోని 444.03 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని రైతుల పేరిట కాజేసేందుకు టిడిపి నేతలు చేస్తున్న ప్రయత్నాలు కూడా తాజాగా వెలుగుచూడటం ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది. దాదాపు 200 కోట్ల విలువైన ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఒక మంత్రి, ఆయన బంధువుతోపాటు, కాంగ్రెస్ హయాంలో ఉత్తరాంధ్రను శాసించిన ప్రస్తుత వైసీపీ కీలకనేత సోదరుడు రైతుల వద్ద ఇప్పటికే కారుచౌకగా భూములు కొనుగోలు చేశారు. ఇవన్నీ పార్టీ ప్రతిష్ఠకు మచ్చ తెస్తున్నాయని పార్టీ సీనియర్లు వాపోతున్నారు.

సర్కారు భయపడుతోందా?
తాజాగా జరుగుతున్న భూ దందా వెనుక ఒక మంత్రి ఉన్నారని, ఆయన కొనే్నళ్లుగా విశాఖను శాసిస్తున్న నేపథ్యంలో పెంచుకున్న రాజకీయ-కుల బలాన్ని చూసి ప్రభుత్వం-పార్టీ నాయకత్వం భయపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు మంత్రికి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి దన్ను ఉందని, ఆయనపై చర్య తీసుకుంటే ఎక్కడ వైసీపీలోకి వెళ్లిపోతారన్న భయంతోనే, ప్రభుత్వం వెనుకంజ వేస్తోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీల కంటే సొంత ఇమేజ్ పెంచుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చే ఆయనపై చర్య తీసుకోవాలంటే ప్రభుత్వం వణికిపోతుండటం పార్టీని పణంగా పెట్టడమేనంటున్నారు.

గంటా ఇరికించారా?
మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి రాసిన లేఖ పార్టీని ఇరుకునపెట్టినట్టయిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గంటా తన లేఖ ద్వారా అటు తనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్న మంత్రి అయ్యన్నను కూడా ఇరికించారంటున్నారు. ఈ కబ్జాలపై సీబీఐ, సీఐడి, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరడం వ్యూహాత్మకమేనంటున్నారు. ఎలాగూ బాబు సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించరన్న విషయం తెలిసే ఆయన ఆ లేఖ రాసి ఇరుకునపెట్టారంటున్నారు. తాను సచ్ఛీలుడినన్న సంకేతాలను పంపడమే దీని ఉద్దేశమని విశే్లషిస్తున్నారు.
ప్రధాని దృష్టికి..
విశాఖలో వరస వెంట జరుగుతున్న భూ దందాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలయ్యాయి. వైసీపీ ఆ మేరకు అన్ని డాక్యుమెంట్లు సేకరించి, మోదీకి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ అధినేత జగన్, ఎంపీలే ఢిల్లీకి వెళ్లి వాటిని సమర్పించాలని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే బిజెపికి నేతలు కొందరు విశాఖ భూదందాలపై వస్తున్న కథనాలను పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపినట్లు సమాచారం.
ప్రధాని దృష్టికి..
విశాఖలో వరస వెంట జరుగుతున్న భూ దందాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలయ్యాయి. వైసీపీ ఆ మేరకు అన్ని డాక్యుమెంట్లు సేకరించి, మోదీకి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ అధినేత జగన్, ఎంపీలే ఢిల్లీకి వెళ్లి వాటిని సమర్పించాలని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే బిజెపికి నేతలు కొందరు విశాఖ భూదందాలపై వస్తున్న కథనాలను పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపినట్లు సమాచారం.