ఆంధ్రప్రదేశ్‌

ఆధునిక పద్ధతుల్లో ఆహార ఉత్పత్తుల నిల్వ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 14: ఆహార ఉత్పత్తుల నిల్వకు సంబంధించి యాంత్రీకరణ ద్వారా ఆధునిక పద్ధతులు పాటించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల సహాయ మంత్రి సిఆర్ చౌదరి సూచించారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ), కేంద్ర గిడ్డంగుల సంస్థ, భారత నాణ్యత ప్రమాణాల సంస్థ (బిఐఎస్)ల ప్రతినిధులతో విశాఖలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఆహార సంస్థ, భారత గిడ్డంగుల సంస్థలు వ్యవసాయ ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో నిల్వచేస్తూ వ్యవసాయ రంగానికి దన్నుగా నిలుస్తున్నాయన్నారు. ఎఫ్‌సిఐ నాణ్యమైన సరుకులు సేకరించాలని, అదే సందర్భంలో గిడ్డంగుల సంస్థ వాటిని సమర్ధ నిర్వహణ ద్వారా భద్రపరచాలని సూచించారు. నాణ్యమైన వస్తువులను తిరిగి వినియోదారులకు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేసి, సామర్ధ్యం మేరకు గిడ్డంగులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారత నాణ్యత ప్రమాణాల సంస్థ నాణ్యమైన సరుకులు వినియోగదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నాశిరకం, నాణ్యత లోపించిన వస్తువులను గుర్తించి, వాటి విక్రేతలపై కేసులు నమోదు చేయాలన్నారు. వీధి వ్యాపారులు తినుబండారాలను తయారు చేసే విధానంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా బిఐఎస్ సమర్ధవంతంగా పనిచేసినప్పుడే వినియోగదాలకు మేలు చేకూరుతుందన్నారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సమర్ధవంత పాలకు సహకరించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎఫ్‌సిఐ, బిఐఎస్, సిడబ్ల్యుసి అధికారులు పాల్గొన్నారు.