ఆంధ్రప్రదేశ్‌

‘వంగవీటి’ కేసులో సెన్సార్ బోర్డు, పోలీసులను పార్టీలుగా చేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 14: ‘వంగవీటి’ సినిమా కేసులో సెన్సార్ బోర్డు, పోలీసులను పార్టీలుగా చేర్చాలని విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. వివాదాస్పద చిత్రాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ‘వంగవీటి’ సినిమాపై గతంలో తీవ్ర వివాదం రేగిన విషయం తెలిసిందే.
వాస్తవాలకు విరుద్ధంగా వంగవీటి మోహనరంగాపై కథాంశాలు చిత్రీకరించారంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మపై రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సిపి నేత వంగవీటి రాధాకృష్ణ గతంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వర్మపై డిజిపి నండూరి సాంబశివరావును కలిసి ఆయన ఫిర్యాదు కూడా చేశారు. అంతటితో ఆగని రాధా తమ ప్రతిష్ఠకు భంగం కలిగే రీతిలో ఏకపక్షంగా చిత్రం రూపొందించారంటూ కొద్దిరోజుల క్రితం వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, సహ నిర్మాత సుధీర చంద్రలపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి అతని తరపు న్యాయవాదులు గతంలో వాదనలు వినిపించారు. అప్పట్లో వాదనలు విన్న న్యాయమూర్తి బదిలీ కావడం, కొత్తగా మరో న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించడంతో న్యాయవాదులు ఎస్ మల్లేశ్వరరావు, గోగుశెట్టి వెంకటేశ్వరరావు, పడవల ఏడుకొండలు బుధవారం మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట మరోసారి వాదనలు వినిపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిపై పోలీసు కమిషనర్‌కు, సెన్సార్ బోర్డుకు ఇచ్చిన ఫిర్యాదులను, హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ కాపీలను న్యాయమూర్తికి సమర్పించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎమెండ్‌మెంట్ పిటిషన్ వేయమని, అందులో సెన్సార్ బోర్డు, పోలీసులను కూడా పార్టీలుగా చేర్చమని న్యాయవాదులకు సూచించారు. అనంతరం కేసును ఈ నెల 30కి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.