ఆంధ్రప్రదేశ్‌

గల్లంతైన జాలర్ల కోసం విస్తృత గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 14: సముద్రంలో వేటకు వెళ్ళి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం బంగాళాఖాతంలో రక్షణ దళాలు గాలింపు చర్యలు ముమ్మరంచేశాయి. కాకినాడ నగరంలోని పర్లోవపేట గ్రామానికి చెందిన ఏడుగురు జాలర్లు మే 31వ తేదీన ఫైబర్ బోటుపై వేటకు వెళ్ళి తిరిగి రాకపోవడంతో బాధిత కుటుంబాలు ఈ నెల తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. సుమారు 15 రోజులుగా జాలర్ల ఆచూకీ తెలియకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉండగా, మరోవైపు తీర గస్తీ దళాలు పెద్ద ఎత్తున గాలింపు నిర్వహిస్తున్నాయి. యుద్ధప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టి, గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కాకినాడ అర్బన్ మండల పరిధిలోని పర్లోవపేట గ్రామానికి చెందిన కె లక్ష్మణరావుకు చెందిన ఫైబర్ బోటు లో మే 31వ తేదీ తెల్లవారుజామున స్థానిక కొత్త పోర్టు నుండి జాలర్లు బయలుదేరారు. సూరాడ రాజు(42), తిరిది అప్పారావు(47), మేడ శ్రీను (50), చింతపల్లి రాజు (48), వాడమొదలు జగదీష్(30), పొట్టి తాతారావు (49), చింతపల్లి అగ్గిపెట్టి (45) చేపల వేటకు వెళ్ళారు. వీరు ప్రయాణిస్తు న్న బోటు కాకినాడ నుండి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతం వైపు వెళ్ళినట్టు గుర్తించారు. వీరు 3-4 రోజుల్లోగా చేపల వేట ముగించుకుని తీరానికి చేరుకోవల్సి ఉండగా, రెండు వారాలు గడచినా ఆచూకీ లభించకపోవడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈనేపథ్యంలో జాలర్ల జాడ తెలుసుకునేందుకు తీర గస్తీ దళాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. కాకినాడ తీరం నుండి 3 ఓడలు, విశాఖపట్నం తీరం నుండి సుమారు 4 ఓడలు గాలింపు చర్య ల్లో ఉన్నట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. చెన్నై నుండి వచ్చిన ప్రత్యేక విమానం విశాఖపట్నం తీరం నుండి గాలింపు చర్య లు చేపట్టిందన్నారు.
మంగళవారం ఈ విమానం విస్తృతంగా గాలించినప్పటికీ, బుధవారం వాతావరణం అనుకూలించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టలేదన్నారు. మత్స్యకారుల జాడ కోసం ఒఎన్‌జిసి, రిలయన్స్ కంపెనీలకు సైతం సమాచా రం పంపి, తీర గస్తీ దళం సమన్వయంతో గాలింపునకు సహకరించాల్సిందిగా కోరినట్టు పేర్కొన్నారు. చెన్నై తీరంలో కూడా గాలింపు చర్యలు చేపట్టాల్సిందిగా కోరినట్టు చెప్పారు.