ఆంధ్రప్రదేశ్‌

హామీలే తప్ప ఆచరణ శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 15: అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని రాష్టప్రతిగా ఎన్నుకుంటే అభ్యంతరం లేదని, రాజకీయాలకర అతీతంగా తటస్థంగా ఉండే అభ్యర్థి రాష్టప్రతి కావాలని ఏఐసిసి అధికార ప్రతినిధి షర్మిష్ఠా ముఖర్జీ అన్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్బరామిరెడ్డి స్వగృహంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి కాకపోతే బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఏకమై అభ్యర్థిని ప్రతిపాదిస్తాయన్నారు. యుపిఏ ప్రభుత్వ హయాంలో రాష్టప్రతిగా ప్రతిభాపాటిల్‌ను ఆమోదించారన్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కొనసాగించే అంశంపై తాను వ్యాఖ్యలు చేయలేనని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె పేర్కొన్నారు. మూడేళ్ళ మోదీ పాలనలో హామీలు ఎక్కువగా ఉన్నాయని, ఆచరణకు నోచుకోలేదన్నారు. యుపిఏ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలనే ఇప్పుడు బిజెపి ప్రభుత్వం పేర్లు మార్పు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ పెట్టి 2013లో స్కిల్ ఇండియా యూత్‌గా అమలు చేస్తే స్కిల్ ఇండియాగా మార్పు చేసిందని ఆమె విమర్శించారు. స్కిల్ ఇండియా పథకం అమలుకు కేవలం 43 శాతం మేర నిధులు మంజూరు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ (ఎన్‌ఓఎఫ్‌ఎన్)ను బిజెపి సర్కార్ డిజిటల్ ఇండియాగా మార్చేసిందన్నారు. స్మార్ట్ సిటీల కింద 642 ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉండగా కేవలం 23 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయని, వీటికి కేవలం రూ.304 కోట్లు వెచ్చించిందన్నారు. ప్రాజెక్టు వ్యయం మొత్తం మీద 38,028,74 కోట్ల రూపాయలుగా ఆమె పేర్కొన్నారు. అందరికీ ఇళ్ళు పథకం అమల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2006 నుంచి 2014 వరకు 12,39,061 ఇళ్ళు 949 నగరాల్లో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, యుఐజి, ఐహెచ్‌డిపి, రే వంటి పథకాల కింద నిర్మించగలిగిందన్నారు. అదే బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత రాజీవ్ అవాస్ యోజన పేరును కాస్త ‘హౌసింగ్ ఫర్ ఆల్’ పథకంగా మార్పు చేసి 2022 నాటికి రెండు కోట్ల పక్కా ఇళ్ళ నిర్మాణం లక్ష్యంగా ప్రకటించిందన్నారు. అయితే ఇందులో మూడేళ్ళకాలంలో కేవలం 1,02,676 ఇళ్ళను మాత్రమే పూర్తిచేసిందన్నారు. బిజెపి పెట్టిన ‘క్లీన్ గంగ మిషన్’ పథకం అమల్లో పూర్తిగా విఫలమైందన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యిందన్నారు. పథకాలు అమలు కాకపోగా, దేశంలో టెర్రరిజం పెచ్చుమీరిందని, మరోపక్క రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. సమావేశంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బెహరా భాస్కరరావు పాల్గొన్నారు.