ఆంధ్రప్రదేశ్‌

జెసి సోదరులకు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 15: భూ కుంభకోణం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు జెసి బ్రదర్స్‌కు ఎదురు దెబ్బే. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డికి దీపక్‌రెడ్డి స్వయానా అల్లుడు. జెసి ప్రభాకర్‌రెడ్డి ఏకైక కూతుర్ని ఆయనకు ఇచ్చి వివాహం చేశారు. హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దీపక్‌రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు జెసి సోదరులు సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. దీపక్‌రెడ్డి బంధువు ఒకరు బళ్లారిలో మైన్స్ నిర్వహిస్తుండటం, అక్కడి జెసి సోదరుల బంధువులు ఉండటంతో అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి టిడిపిలో చేర్పించారు. 2012లో ‘చేయూత సేవా ట్రస్ట్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను దీపక్‌రెడ్డి రాయదుర్గంలో నెలకొల్పారు. రాజకీయంగా ఎదగడానికి దీపక్‌రెడ్డి ఈ ట్రస్టు ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. రాయదుర్గం సమీపంలోని నేమకల్లులో గ్రేడ్ ఇండియా పేర స్టోన్ క్రషింగ్ యూనిట్‌ను తన కుడిభుజంగా చెప్పుకునే శాంతారావుతో కలిసి ఏర్పాటుచేశారు. అప్పటికే టిడిపిలో చేరిన తన మామల ప్రోద్బలంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున రాయదుర్గం టికెట్ దక్కించుకున్నారు. వైకాపా తరఫున పోటీ చేసిన కాపు రామచంద్రారెడ్డి 34 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో రాయదుర్గం నియోజకవర్గం టిడిపి టికెట్ ఆశించారు. జెసి సోదరులు బాబును ఒప్పించి తమ అల్లుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించుకోగలిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీపక్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.