ఆంధ్రప్రదేశ్‌

రైల్వేల అభివృద్ధి సగటులో ముందంజలో ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వే), జూన్ 15: దేశ వ్యాప్తంగా రైల్వేల అభివృద్ధి సగటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని రైల్వేమంత్రి సురేష్ ప్రభు అన్నారు. దేశానికి లాజిస్టిక్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ అవతరించనుందన్నారు. గురువారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, కేంద్ర సమాచార పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజులతో కలిసి రిమోట్ కంట్రోల్ ద్వారా 10 రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించామని, ఇది ఆంధ్ర ప్రజల అదృష్టమని తెలిపారు. రాష్ట్రంలో ఒకే రోజు 10 ప్రాజెక్టులు ప్రారంభించుకున్నామని, ఇవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గీటురాయిగా నిలుస్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లు దేశానికి గమనం, పురోగమనం కూడా రైల్వేల వల్లనే లభిస్తుందన్నారు. రాష్ట్రానికి మంజూరు చేయవలసిన రైల్వే ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురయ్యాని, తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర అవసరాలను గుర్తించి ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ముంబై, అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్వే వల్ల దేశానికి మైలురాయిగా నిలుస్తుందన్నారు. పర్యావరణ హిత ఇంజన్లు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రైల్వేస్టేషన్ల ఆధునీకరణలో భాగంగా ఒక్కొక్క స్టేషన్‌ను కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రపంచస్థాయి స్టేషన్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ-క్యాటరింగ్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చామని, ఢిల్లీలో కూడా ఆంధ్రా వంటకాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా ముందుండేలాగా చేయూతను అందిస్తామన్నారు. సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే ఉద్యోగుల ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు మంగళగిరిలో హాల్ట్ కావాలని స్థానిక ఎంపిలు కోరగా, మంగళగిరిలో హాల్ట్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపామన్నారు. రైల్వేల అభివృద్ధిలో భారతీయ సగటు 42 శాతం ఉంటే, ఆంధ్రప్రదేశ్ సగటు దీనికి ఎక్కువగా ఉందన్నారు. 200 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణంతోపాటు, 140 కిలోమీటర్ల రైల్వే లైన్ల విద్యుద్దీకరణ చేయనున్నామన్నారు. రెండున్నర సంవత్సరాల్లో రైల్వేల అభివృద్ధిని రెట్టింపు చేశామని, రాబోయే రోజుల్లో దీనికి రెండింతల పనులు చేస్తామన్నారు. అమరావతికి రైల్వే కనెక్టివిటి ఏర్పాటు చేస్తామని, విశాఖపట్నంలో 700 కోట్ల రూపాయలతో అధునాతన ఎలక్ట్రికల్ లోకోషెడ్ నిర్వహణ సామర్ధ్యం పెంచుతామన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, సమాచార ప్రసార శాఖల మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ఎంపిగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాష్ట్రానికి 10 ప్రాజెక్టులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలను అభివృద్ధి చేయడానికి ఈ రైల్వే ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గతంలో రాయలసీమను నిర్లక్ష్యం చేశామని, దాన్ని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన రాష్టమ్రని ఆ ఉద్దేశ్యంతో చేయూతను అందిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు రావడానికి కారణం ముఖ్యమంత్రి అడిగిన వెంటనే భూమిని ఇవ్వడమేనని, భూమి లేకపోతే విమానాలు కూడా భూమి మీద దిగలేవని చెప్పారు. రాష్ట్రంలో 30 ప్రాజెక్టులు రూ.41,563 కోట్లతో చేపట్టారని, 4,622 కిలోమీటర్ల పరిధిలో పనులు చేస్తున్నామన్నారు. ఇవన్నీ పూర్తయితే రైల్వేల అభివృద్ధిలో రాష్ట్రం ముందుంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేదే ఆయన ధ్యేయమన్నారు. అందరికీ ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి రావాలని, సాంఘిక అసమానతలు తగ్గాలనేదే ఆయన ధ్యేయమన్నారు. దేశంలో మూడు సంవత్సరాలు దాటిన మోదీ పాలనపై చిన్నపాటి ఆరోపణ కూడా లేదని, పైగా ప్రధాని ప్రతిష్ఠ పెరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విస్తారమైన అవకాశాలను ఉపయోగించుకుని అభివృద్ధి సాధించాలన్నారు.

చిత్రం.. రిమోట్ కంట్రోల్ ద్వారా కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తున్న
రైల్వేమంత్రి సురేష్ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్య, అశోక్‌గజపతిరాజు