ఆంధ్రప్రదేశ్‌

కౌలు రైతులకు లక్ష వరకూ వడ్డీ లేని రుణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 16: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వాణిజ్య బ్యాంకులు ఈ ఏడాది రూ.87,471 కోట్ల రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్ బిసి) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. తాము రూ.91,557 కోట్ల రుణాలు ఇవ్వమని కోరగా, ఇంతవరకే ఆమోదించినట్లు ఆయన తెలిపారు. సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 4వ బ్లాక్‌లోని పబ్లిసిటీ సెల్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాల్లో 10 శాతం అంటే రూ.8,740 కోట్ల రుణాలు కౌలు రైతులకు ఇస్తారని తెలిపారు. కౌలు రైతులకు కూడా లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణం ఇస్తారన్నారు. ఇప్పటికే మూడు లక్షల మంది రైతులకు రుణ అర్హత పత్రాలు (ఎల్‌ఈసిలు) జారీ చేశారని, ఇంకా 5.60 లక్షల మందికి ఇవ్వవలసి ఉందన్నారు. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం అయినందున ఎల్‌ఓసి, సిఓసిలు ఇచ్చిన తరువాత వాణిజ్య బ్యాంకులు తప్పనిసరిగా రుణాలు ఇస్తాయన్నారు. దేశంలో మొదటిసారిగా రైతులకు ఎల్‌ఇసి, సాగు ధ్రువీకరణ పత్రాలు (సిఓసిలు) ఇచ్చింది తమ ప్రభుత్వమేనన్నారు. రైతులకు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీపై శనివారం సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వ్యవసాయ బీమా హెక్టార్‌కు కేంద్రం రూ.6,900లు ఇస్తుందని, అయితే ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా కలిపి హెక్టార్‌కు రూ.15 వేలు చొప్పున రెండు హెక్టార్లకు రూ.30వేలు వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. కేంద్రం ఇచ్చిన దానికి తోడు మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. బీమా రూ.15వేలకు పైన వచ్చినా ఆ మొత్తం రైతులకే ఇస్తామని చెప్పారు.