ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో ఇద్దరు బాలికలు అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) జూన్ 17: విజయవాడలోని గురునానక్ కాలనీ పవిత్రాత్మ నికేతన్ ఆనాథాశ్రమానికి చెందిన ఇద్దరూ బాలికలు అదృశ్యమైన సంఘటన పటమట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి పవిత్రాత్మ నికేతన్ ఆనాథ ఆశ్రమానికి చెందిన బాలికలు రోహిణి (13), మరియమ్మ (11) అనే భోజనం చేసిన పిమ్మట అదృశ్యమైనట్లు నిర్వాహకులు సిస్టర్ అజిత పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం ఉదయం పటమట పోలీసులు మిస్పింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. రోహిణి, మరియమ్మ అనాథ పిల్లలు కావటంతో పవిత్రాత్మ నికేతన్ నిర్వాహకులు 2013లో వీరికి ఆశ్రయం కల్పించారు. బాలికలను ఆనాథ ఆశ్రమం నిర్వాహకులు చదివిస్తున్నారు. రోహిణి 8వ తరగతి చదువుతుండగా, మరియమ్మ 6వ తరగతి చదువుతోంది. రోహిణి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన బాలిక కాగా, మరియమ్మ అనే కృష్ణాజిల్లా మచీలిపట్నానికి చెందిన బాలికగా పోలీసులు తెలిపారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్, మచిలీపట్నం, మొగల్తూరు, తదితర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ త్వరతగతిన కనుగునేందుకు విజయవాడ డిసిపి ఆధ్వర్యంలో నాలుగు పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.